Kalpika Ganesh: సినీ నటి కల్పిక గణేష్ (Kalpika Ganesh) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె బయటకు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తరచూ వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న కల్పిక గణేష్ గురించి ఆమె తండ్రి గణేష్(Ganesh) తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా కల్పిక అనారోగ్య సమస్యల గురించి కూడా ఆమె తండ్రి తెలియచేసినట్టు తెలుస్తోంది. కల్పిక గత కొంతకాలంగా మానసిక స్థితి బాగలేదని ఆమె డిప్రెషన్(Depression) లోకి వెళ్లిపోయిందని, వింత వ్యాధితో బాధపడుతుందని తెలియజేశారు.
కల్పిక వల్ల కుటుంబానికి ప్రమాదం..
ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన తన కూతురికి చికిత్స చేయించామని దాదాపు రెండు సంవత్సరాలపాటు మందులు వాడటం మానేసిందని ,అందుకే తనకు పూర్తిగా నయం కాలేదని తెలిపారు.. ఇలా రెండు సంవత్సరాల నుంచి మందులు పక్కన పెట్టిన ఈమె తరచూ అందరితో గొడవలు పడుతూ వివాదాలు సృష్టిస్తుందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కల్పిక మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల గతంలో రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం(Suicide Attempt) కూడా చేసిందని ఈయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె వల్ల తన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం ఉందని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మానసిక పరిస్థితి బాగాలేదా?
ఇలా తన కూతురి గురించి తండ్రి స్వయంగా పోలీసులకు ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా తన మానసిక స్థితి బాగా లేకపోవటం వల్లే అందరితో గొడవ పడుతున్నారని స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే ఈమెపై రెండు కేసులు నమోదు కాగా ఈ రెండు కేసులలో తనకు కాస్త ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కల్పికను అరెస్టు చేయకూడదు అంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇటీవల కాలంలో ఈమె సైబర్ క్రైమ్ ఫై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఉపశమనం కలిగించిన కోర్టు…
ఇలా ఈ కేసుతోపాటు మే 29వ తేదీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ యాజమాన్యంపై కల్పిగా దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అక్కడ యాజమాన్యంతోను సిబ్బందితో ఈమె గొడవకు దిగడమే కాకుండా వారిపై బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. దీంతో ప్రిజం పబ్ యాజమాన్యం కల్పికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఈ రెండు కేసుల విషయంలో ఈమె కోర్టును ఆశ్రయించడంతో ఈమె పిటిషన్ విచారించిన కోర్టు తనను అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశాలను జారీ చేశారు. ఇక ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా నటిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కల్పిక తదుపరి పలు సినిమాలలో నటించారు. అయితే సినిమాలలో నటించడం కంటే కూడా వివాదాలలో నిలుస్తూ బాగా పాపులర్ అయ్యారని చెప్పాలి.
Also Read: Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం… ఎయిర్ పోర్టులో నగలు మాయం!