Suriya: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్స్ లో సూర్య ఒకరు. చాలామంది తెలుగు ప్రేక్షకులకు సూర్య ఒక తమిళ హీరో అని తెలియదు. అంతలా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు సూర్య. కేవలం సూర్య మాత్రమే కాదు అతని తమ్ముడు కార్తీ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయాడు. అతని ఏకంగా తమిళ్ ప్రేక్షకులు కంటే నాకు తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు.
ఇక సూర్య సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారు అనడానికి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు నిదర్శనం. రీసెంట్ టైమ్స్ లో సూర్య హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. కరెక్ట్ కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్దకు వస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు.
సూర్య రాంగ్ టైమింగ్
సూర్య తోటి నటులను ఎంకరేజ్ చేస్తారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎంకరేజ్ చేయడంలో పర్షియాలిటీ చూపించకూడదు అనేది కొంతమంది అభిప్రాయం. ఇంతకు జరిగిన విషయం ఏమిటంటే… సూర్య కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా చిత్ర యూనిట్ కు తన అభినందనలు తెలిపారు. ఇక్కడితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక రకమైన ఆలోచన మొదలైంది. ఇప్పుడు కింగ్డమ్ సినిమాకి అభినందనలు తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా అప్పుడు ఎందుకు? విషెస్ చెప్పలేదు అనేది వాళ్ళ అభిప్రాయం. ఒకరకంగా హరిహర వీరమల్లు సినిమా కూడా పాన్ ఇండియా సినిమా. ఆ ప్రొడ్యూసర్ తమిళ్ ప్రేక్షకులకు బాగా పరిచయం. తమిళ్ లో ఎన్నో సినిమాలు కూడా చేశారు.
అసలు జరిగిన విషయం ఏమిటంటే
సూర్య రెట్రో సినిమా తర్వాత ట్విట్టర్ ను వాడటం తగ్గించారు. రీసెంట్ గా తాను నటించిన కరుప్పు సినిమా కంటెంట్ మాత్రమే తన పోస్ట్స్ లో కనిపిస్తుంది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అతని బర్త్డే సందర్భంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ని కూడా ఇప్పుడే చూసుకున్నారు సూర్య. ఈ తరుణంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్న కింగ్డమ్ ట్వీట్ కనిపించింది. ఇదివరకే ఆ టీజర్ కి తమిళ్ లో సూర్య వాయిస్ ఇవ్వడం వలన టక్కున అది గుర్తొచ్చి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అర్థమైతే అంతా సజావుగానే ఉంటుంది. అలానే సూర్య అంటే పవన్ కళ్యాణ్ కి కూడా ప్రత్యేకమైన గౌరవం ఉంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Hearty wishes team!! #Kingdom @TheDeverakonda @gowtam19 @anirudhofficial @vamsi84 @SitharaEnts https://t.co/cKiu2e2Lgc
— Suriya Sivakumar (@Suriya_offl) July 31, 2025