Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు(Urvashi Rautela) ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఈమె లండన్(Landon) వెళ్ళగా ఎయిర్ పోర్ట్ లో తన విలువైన నగలు చోరీకి గురి కావడంతో భారీ స్థాయిలో నష్టపోయారని తెలుస్తోంది.ఊర్వశి రౌతేలా ఇటీవలే వింబుల్డన్ టోర్నీలో పాల్గొని భారత్‌కు తిరిగి వస్తుండగా లండన్‌లోని గాట్‌విక్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అయితే ఈ ఎయిర్ పోర్ట్ లోనే ఈమె సూట్ కేస్ దొంగలించడం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ సూట్ కేస్ లో తన నగలు(Jewellery) కూడా ఉన్నట్టు తెలియజేశారు. అందులో సుమారు 70 లక్షల రూపాయల విలువచేసే నగలు ఉన్నట్టు ఈ సందర్భంగా ఈమె తెలిపారు.
ఎయిర్ పోర్టులో దొంగతనం…
ఎయిర్ పోర్టులో తన సూట్ కేస్ మిస్ అయిన నేపథ్యంలో అక్కడ అధికారులకు తాను ఫిర్యాదు చేసిన ఎవరో కూడా తన ఫిర్యాదు పట్ల స్పందించడం లేదని ఈమె నిరాశ వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఊర్వశి తెలియచేశారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన అంశాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఈమె ఎమిరేట్స్, వింబుల్డన్ అధికారులను ట్యాగ్ చేసింది. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది అయితే ఇలా వస్తువులను పోగొట్టుకోవడం, లక్షల్లో నష్టపోవటం ఈమెకు ఇది మొదటిసారి కాదని చెప్పాలి.
రూ.70 లక్షల విలువైన నగలు చోరి…
గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇలా తన విలువైన వస్తువులను పోగొట్టుకున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వచ్చారు. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కూడా ఆమె తన ఒక చెవిపోగు పోగొట్టుకున్నారని, దాని విలువ దాదాపు రూ. 45 లక్షల రూపాయలని వెల్లడించారు అయితే గత కొద్దిరోజుల క్రితం లండన్ క్రికెట్ స్టేడియం కి వెళ్లిన ఈమె ఐఫోన్ కూడా దొంగలించబడింది అంటూ ఈ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఊర్వశి ఎక్కడికి వెళ్లన ఇలా విలువైన వస్తువులను పోగొట్టుకుంటున్న నేపథ్యంలో ఈమె వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా 70 లక్షల విలువ చేసే నగలు దొంగలించబడ్డాయనే విషయం తెలియడంతో అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్పెషల్ సాంగ్స్ తో బిజీగా ఊర్వశీ…
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ అనే భేదాభిప్రాయాలు లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఊర్వశి ఎక్కువగా స్పెషల్ సాంగ్స్(Special Songs) ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ (Daku Maharaj)సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపించి సందడి చేశారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఊర్వశి ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా, డ్రాగన్ సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.
Also Read: Actress Radhika: అనారోగ్యానికి గురైన నటి రాధిక… రెండు రోజులుగా హాస్పిటల్ లోనే!