Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు విపక్ష బీజేపీ, ఇంకోవైపు బీజేపీలు సిద్ధమయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. సమావేశం వెనుక అసలు మేటరేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీ నేతలు, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. తాజాగా బీజేపీ కూడా అటువైపు దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వంతైంది.
పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య అరగంటకు పైగా మంతనాలు సాగాయి. తొలుత యోగక్షేమాలు గురించి మాట్లాడుకున్నారు. తెలంగాణ నడుస్తున్న రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్‌పై ఇరువురు మధ్య చర్చ సాగినట్టు తెలుస్తోంది.
తన ఓపీనియన్‌ని విష్ణు నుంచి రాబట్టారట కవిత. బైపోల్‌లో పోటీ చేసే ఆలోచన ఉందాని ఆమె అడిగినట్టు తెలుస్తోంది. తన మనసులోని మాటను విష్ణు బయట పెట్టారట. విష్ణు ఓకే అయితే తెలంగాణ జాగృతి నుంచి బరిలోకి దించాలన్నది కవిత ఆలోచన. కవిత గనుక విష్ణును బరిలోకి దించితే బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పదని అంటున్నారు.
ALSO READ: తెలంగాణలో ప్రభుత్వ బడిలో ఏఐ ల్యాబ్.. ఇంతకీ ఎక్కడ?
మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎవర్ని నిలబెట్టినా విజయం కోసం తనవంతు కృషి చేస్తారని మాజీ ఎమ్మెల్యే విష్ణు అన్నారట. మూడురోజుల తర్వాత కవితతో విష్ణు భేటీ కావడం అనుమానాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి విష్ణు టికెట్ ఆశిస్తున్నట్లు వార్తలు లేకపోలేదు.
బీఆర్ఎస్ తరపు మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలోకి దించాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. దీనిపై బీఆర్ఎస్ ఇంకా ప్రకటన చేయలేదు. నేతలను ఆమె కలుపుకుని పోతున్నారు. మద్దతు ఇస్తానన్న విష్ణు, సడన్‌గా కవితతో భేటీ కావడంపై రాజకీయంగా ఆసక్తి మొదలైంది. ఆయన కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కవిత అడుగులు ఏ విధంగా ఉంటున్నాయనేది నేతలు చర్చించుకుంటున్నారు.
పీజేఆర్ కుమారుడు విష్ణుతో కల్వకుంట్ల కవిత భేటీ
అరగంటకు పైగా ఇద్దరి మధ్య సాగిన మంతనాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విష్ణును పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం pic.twitter.com/QbG3Lfq7S2
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2025