E-Paper
Advertisement

రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!

రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!
Advertisement

Sandiyar Movie:ఎప్పుడూ సరికొత్త పాత్రలతో అలరించే లోకనాయకుడు కమల్ హసన్ తాజాగా మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. అదే ‘సండియర్’ (Sandiyar).ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

రిలీజ్ అయిన పోస్టర్‌లో కమల్ హాసన్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందనే చెప్పాలి. ఒక ఓల్డ్ వెహికల్ కిటికీ దగ్గర కూర్చొని సీరియస్‌గా కనిపిస్తున్నాడు.ఇక గుబురు గడ్డం, చేతిపై గాయాలు, చుట్టూ కనిపించే రక్తపు మరకలు చూస్తుంటే ఇదొక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రాబోతోందని క్లారిటీ వచ్చేసింది .

Advertisement

2004లో కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన ‘విరుమాండి’ సినిమాకు మొదట ‘సండియర్’ పేరును అనుకున్నారట . అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ పేరును మార్చాల్సి వచ్చిందని టాక్ . ఇప్పుడు దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ‘సండియర్ పేరుతో సినిమాను ప్రకటించడం ఇక్కడ విశేషం. అయితే ఈ కొత్త ‘సండియర్’కు, ‘విరుమాండి’కి ఏమైనా సంబంధం ఉందా అనేది రిలీజ్ అయితే కాని తెలీదు.

ఇక ఈ సినిమాకు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘చిత్తా’ అనే చిన్నపిల్లల సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.అంతకుముందు ‘పన్నైయారుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘వీర ధీర సూరన్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు కూడా. ముఖ్యంగా ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్లను రస్టిక్‌గా చూపించడంలో ఆయనకు మంచి పేరుందనే చెప్పాలి.

Advertisement

అలాంటి అరుణ్ కుమార్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడిని ఎలా చూపిస్తారో అనే అంచనాలు ఇపుడు తమిళ తంబీలలో బాగా పెరిగిపోయాయి.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ‘విక్రమ్’, ‘ఇండియన్ 2’ తర్వాత అనిరుధ్ కమల్ హాసన్ సినిమాకు పనిచేయడం ఇది ముచ్చటగా మూడోసారి కావడం ఇక్కడ మరో విశేషం. ముఖ్యంగా మాస్ యాక్షన్ సీన్లకు అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇక యాక్షన్ కోరియోగ్రఫీని ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘లియో’ వంటి సినిమాలకు పనిచేసిన అన్‌బరివ్ జోడీ తీసుకోవడంతో సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఎలా పేలుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యాక్షన్ లవర్స్.సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ, సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్షన్, అమృతా రామ్ కాస్ట్యూమ్స్ అందిస్తున్న ఈ సినిమాని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.

చూడాలి మరి ‘థగ్ లైఫ్’ లాంటి డిజాస్టర్ తర్వాత రాబోతున్న ఈ ‘సండియర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

ALSO READ :పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న అమీర్ ఖాన్ మేనకోడలు.. ఫోటోలు వైరల్!

Tags

Related News

తేజ సజ్జ నిశ్చితార్థం.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!

పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న అమీర్ ఖాన్ మేనకోడలు.. ఫోటోలు వైరల్!

అలీ షూటింగ్‌లతో బిజీ.. నేను ఆసుపత్రిలో ఒంటరిగా.. జుబేదా ఆవేదన!

రూమర్లకు చెక్.. పండగకే రాబోతున్న ‘కాకా’ .. డైరెక్టర్ క్లారిటీ!

బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘దాదా’ పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

మొదట్లో జోరు..ఇప్పుడు బేజారు!.ఆదర్శకుటుంబం ఇక అంతేనా?

శూర్పణఖ మేకప్ కోసం రోజుకు అన్ని గంటలా? రకుల్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×