Zayn Khan: సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న నటి జైన్ ఖాన్ (Zayn Khan) ఇప్పుడు తన సరి కొత్త ఫోటోషూట్‌తో అభిమానులని ఫిదా చేస్తుంది.ముఖ్యంగా పింక్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ‘Cinderella Story’ అంటూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాని ఒక రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.
ఈ ఫోటోల విషయానికి వస్తే పింక్ కలర్ లెహంగా డ్రెస్‌లో మెరిసిపోయింది జైన్.ఇక ఈ డ్రెస్‌పై ఉన్న వర్క్, మెరిసే డిజైన్లు ఆమె అందాన్ని మరింత పెంచాయనే చెప్పాలి. దీనికి మ్యాచింగ్‌గా వేసుకున్న దుపట్టా ,చెవులకు పెద్ద జుంకాలు, చేతికి బ్రేస్‌లెట్, వేలికి ఉంగరం పెట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది.
ఇక హెయిర్ స్టైల్, మేకప్ కూడా ఆమెకు బాగా సెట్ అయ్యాయనే చెప్పాలి. కనిపించడం ఈ ఫోటోషూట్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ముఖ్యంగా ఆమె లుక్, డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లుఇక ఈ ఫోటోషూట్ కోసం మోనాలి రాయ్ డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌ను , సిల్వర్ క్వీన్ జ్యువెలరీని ఉపయోగించగా, సజ్నా శివన్ లైట్ పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన ఈ ఫోటోలు నెట్టింట్లో మంటలు పెట్టేస్తున్నాయి.
ఇక జైన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె, హీరో అమీర్ ఖాన్‌కు మేనకోడలు. అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తుండటం విశేషం. 2020లో వచ్చిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమమైన ఈ స్టార్ కిడ్ ఆ తర్వాత ‘ఫీల్స్ లైక్ ఇష్క్’, ‘మోనికా ఓ మై డార్లింగ్’ వంటి ప్రాజెక్టుల్లో నటింఛి అలరించింది.
ఇక ‘మోనికా ఓ మై డార్లింగ్’ సినిమాలో రాజ్‌కుమార్ రావు, హ్యూమా ఖురేషి వంటి నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జైన్ ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లోనూ కనిపించి మెప్పించింది. ఇక తాజాగా ‘ఇల్లీగల్ 3’ వంటి వెబ్ సిరీస్‌లతోనూ ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.మొత్తానికి జైన్ ఖాన్ సినిమాలతోనే కాకుండా తన అందమైన ఫోటోషూట్లతోనూ వార్తల్లో నిలుస్తు ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బీటౌన్ బ్యూటీ !
ALSO READ :అలీ షూటింగ్‌లతో బిజీ.. నేను ఆసుపత్రిలో ఒంటరిగా.. జుబేదా ఆవేదన!