Teja Sajja Engagement: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోస్ తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలో అడుగుపెట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మరి కొంతమంది హీరోలు హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) నవంబర్ 5వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో కిరణ్మయి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక మరొక హీరో తేజ సజ్జ (Teja Sajja)కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా తేజ సజ్జ పెళ్లికి సంబంధించిన ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ పెళ్లి వార్తలపై తేజ స్పందిస్తూ నిజంగానే తాను పెళ్లి చేసుకోబోతున్నానని తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి యుఎస్ కి చెందిన అమ్మాయని, తను ఐటీ కంపెనీ నిర్వహిస్తోంది అంటూ తేజసజ్జా తెలిపారు. అయితే అమ్మాయి పేరు ఏంటి? ఎలా ఉంటుంది అనే వివరాలను తెలియజేయలేదు. ఇకపోతే తాజాగా తేజ తన తన నిశ్చితార్థపు(Engagment) వేడుకలలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈయన తన నిశ్చితార్థపు తేదీని ప్రకటించకపోయినప్పటికి సెలబ్రిటీలను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.
తాజాగా తేజ సజ్జ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(C.M.Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిసి ఆయనని తన నిశ్చితార్థపు వేడుకకు ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తేజ తన నిశ్చితార్థానికి ఆహ్వానాలు అందజేస్తున్న నేపథ్యంలో ఈయన నిశ్చితార్థం ఎప్పుడు? ఎక్కడ అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం తేజ సజ్జ నవంబర్ 16వ తేదీ తన నిశ్చితార్థపు వేడుకను హైదరాబాదులో జరుపుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్టానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనిలో తేజ బిజీగా ఉన్నారు.
ఇలా నవంబర్ 16వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్న తేజ డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈయన వివాహం రాజస్థాన్లో జరగబోతుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. కానీ వివాహపు తేదీని మాత్రం ప్రకటించలేదు. వివాహం కేవలం సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తేజ క్లారిటీ ఇచ్చారు. అయితే పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయమని తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి తాను ఇష్టపడతానని చెప్పిన ఈయన కాబోయే భార్య వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.
Also Read: తల్లి కాబోతున్న జబర్దస్త్ ఫైమా…విమర్శలు కురిపిస్తున్న నెటిజన్స్!