Kangana Ranaut:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా అందం, అభినయంతోనే కాదు ఊహించని విమర్శలతో నిత్యం సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఎదుర్కొంటూ ఉంటుంది. అలాంటి ఈమెకు నటిగా మంచి గుర్తింపు అందించిన చిత్రాలలో క్వీన్ కూడా ఒకటి. 2014లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ విజయాన్ని కూడా అందించింది. అయితే ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా క్వీన్ 2 రాబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటుంది . ఇలాంటి సమయంలో ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు.
క్వీన్ 2 చిత్రంపై ఏకంగా రూ.250 కోట్ల న్యాయపరమైన వివాదం నెలకొనడం.. బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. ఫాంటమ్ స్టూడియోస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ పై ఏకంగా రూ.250 కోట్ల నష్టం దావా వేసింది. తమ అనుమతి లేకుండానే ఈ సినిమాను రూపొందించారని.. అసలు సినిమా మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే దీనికి ప్రధాన కారణం అంటూ సదరు నిర్మాణ సంస్థ ఆరోపించింది. ఈ మేరకు ఫాంటమ్ స్టూడియోస్ తన వాదనను వినిపిస్తూ.. “క్వీన్ చిత్రానికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులలో మాకు 50 శాతం వాటా ఉంది. సీక్వెల్ లేదా ఇతర అనుబంధ చిత్రాలు నిర్మించాలంటే కచ్చితంగా మా అనుమతి తీసుకోవాల్సిందే. క్వీన్ 2 నిర్మాణానికి సంబంధించి మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. పైగా దీని నిర్మాణానికి మేము ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వలేదు. ఈ కారణంగానే ఈ సినిమా మా హక్కులను ఉల్లంఘించింది “అంటూ ఆరోపిస్తూ తమ వాదనలను కోర్టుకు తెలిపినట్లు సమాచారం.
also read:హార్మోన్ చికిత్స వల్ల ఎన్నో మార్పులు.. ఒత్తిడి భరించలేకపోయా – కృతి సనన్
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఫాంటమ్ స్టూడియోస్ ఈ వివాదం పై బహిరంగంగా ఒక నోట్ కూడా విడుదల చేసింది. అలాగే జియో స్టార్ క్వీన్ 2 దర్శకుడు వికాస్ బహల్ తో పలుమార్లు చర్చలు జరిపి, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేశారట. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే పైగా క్వీన్ 2 సినిమా షూటింగ్ కూడా పూర్తవడం, సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ ప్రయత్నాలు, చర్చలు ఫలించలేదని ఆ కారణంతోనే సంస్థ కోర్టును ఆశ్రయించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపోతే ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ చిత్ర బృందం ఈ వివాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు జియో హాట్ స్టార్ కూడా అధికారికంగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే నష్టపరిహారం కోరుతూ కోరుకున్న ఆశ్రయించిన ఫాంటమ్ స్టూడియోకి న్యాయం జరుగుతుందా? ఇరుపక్షాలు రాజకీ వస్తాయా ? లేక న్యాయపోరాటం మరింత ముదురుతుందా ?అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది . మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలి అంటే ఎవరో ఒకరు అధికారికంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.