Rajanala Life: తెలుగు సినిమా ఇండస్ట్రీ..ఇక్కడ వైభవాలెన్నో..అంతకు మించిన విషాదాలు అన్ని .ఇక ఘన వైభవం చూసి జీవితం చివరి రోజులని విషాదంగా ముగించిన వారు ఎందరో.అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు క్రూరత్వానికి కేరాఫ్ అయిన రాజనాలదే .రాజనాల పూర్తి పేరు కాళేశ్వరరావునాయుడు.1925 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల చిన్నప్పటి నుంచే రొటీన్ కి భిన్నంగా ఆలోచించేవాడు.
ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా
ఇంటర్ పూర్తయిన తర్వాత ఎలాగూ చేయాల్సింది ఉద్యోగమే కదా అనే ఆలోచనతో చదువును మధ్యలోనే ఆపేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాడు. పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది 1944 నుంచి 51 వరకు ఆ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేశాడు.అయితే ఆయనలోని చదువుకోవాలనే కోరిక మాత్రం తీరలేదు.అలా లక్నో యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు రాజనాల.అంతేకాకుండా ఇంగ్లీష్ తో పాటు మరిన్ని భాషలపై పట్టు సాధించాడు.ఇక షేక్స్పియర్ నాటకాల్లోని డైలాగ్స్ ని చాలా గంభీరంగా చెప్పేవాడు కూడా.ఇక మద్రాస్ లోని ఆయన ఇంట్లో ఉన్న లైబ్రరీలో లక్షల విలువైన పుస్తకాలు ఉండేవి.
ప్రతిజ్ఞ సినిమాలో విలన్ గా అవకాశం
అలా ఫిలాసఫీ, న్యూమరాలజీ, జ్యోతిష్యం వంటి ఎన్నో విషయాలపై మంచి పట్టు సాధించాడు రాజనాల .ఇక నాటకాలపై ఉన్న ప్రేమతో 1948లో తన స్నేహితుడు లక్ష్మి కుమార్ రెడ్డితో కలిసి ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి ఆత్రేయ రచించిన ఎవరు దొంగ అని నాటకాన్ని ప్రదర్శించాడు.అయితే అది ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహానికి గురైయ్యాడు.ఆ తర్వాత ప్రగతి అనే నాటకం వేయడంతో ఆయనను మూడు నెలలు సస్పెండ్ చేశారు .ఈ క్రమంలోనే సినిమా ప్రయత్నాల కోసం మద్రాస్ వెళ్లగా స్నేహితుడు లక్ష్మీ కుమార్ రెడ్డి ప్రముఖ నిర్మాత హెచ్ఎం రెడ్డి నిర్మిస్తున్న ప్రతిజ్ఞ సినిమాలో విలన్ గా అవకాశం ఇప్పించాడు.వాస్తవానికి రాజనాలకు విలన్ గా నటించడం ఇష్టం లేదు.
400 కి పైగా సినిమాలు
అయినా 1953లో రిలీజ్ అయిన ప్రతిజ్ఞ సినిమాతో మంచి పేరు వచ్చింది .ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన వద్దంటే డబ్బు చిత్రంలో ఆయనకు మామగారిగా ముసలి పాత్రలో నటించి మెప్పించాడు రాజనాల.ఇక ఆ సమయంలో పెరిగిన చదువుతో రాజనాలను ఆప్యాయంగా మామాజీ అని పిలిచేవాడు ఎన్టీఆర్ .ఆ తర్వాత ఎన్టీఆర్ తన సొంత చిత్రం జయ సింహా లో రాజనాలని పవర్ ఫుల్ విలన్ పాత్ర వేయించి రాజనాల కెరీర్ ని మరో మలుపు తిప్పాడు ఎన్టీఆర్.ఇక ఆ సినిమాలో రాజనాల చేసిన కత్తి యుద్ధాలకి అప్పటి ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు .అప్పట్లో ఎన్టీఆర్, కాంతారావు ఎక్కువగా చేస్తే జానపద పౌరాణిక సినిమాల్లో విలన్ పాత్ర చేయాల్సింది రాజనాలే.కంసుడు శిశుపాలుడు,అలాగే విఠలాచార్య సినిమాల్లోని కత్తి యుద్ధాల పాత్రలకు ఆయన పెట్టింది పేరు .ఇక ఎన్టీఆర్ సొంత సినిమాలైనా శ్రీకృష్ణ పాండవీయం, గులేబకావళి కథ, వరకట్నంలో రాజనాల ఉండటానికి ఎన్టీఆర్ చేసిన సిఫార్సులే కారణం.దాదాపు 15 సంవత్సరాలు అగ్రస్థానంలో ఉంటూ 400 కి పైగా సినిమాలు చేశాడు రాజనాల.
‘మాయ ది మాగ్నిఫిషియెంట్’లో ఇండియన్ అఫీషియల్
ఇక 1966 లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మాయ ది మాగ్నిఫిషియెంట్’ చిత్రంలో ఇండియన్ అఫీషియల్ గా నటించి ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న మొదటి తెలుగు నటిగా గుర్తింపు పొందాడు రాజనాల.హాలీవుడ్ మేకర్స్ ఎంజీఎం సంస్థ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఇంగ్లీష్ నాలెడ్జ్ చూసి మెస్మరైజ్ అయిపోయారు.హిందీ విలన్లు కె.ఎన్.సింగ్, అజిత్, ప్రాణ్ వంటి వారు రాజనాలని గురూజీ అని గౌరవించేవారు అంటే రాజనాల రేంజ్ ఎలా ఉండేదో అర్థమవుతుంది.ఇక రాజు కపూర్ ,షమ్మీ కపూర్ అంటే కూడా రాజనానికి ఎంతో ఇష్టం ఉండేది.ఒకానొక దశలో అగ్ర హీరో తో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్ రాజనాలే.ఇక మద్రాస్ లో ఆయనకు అయిదు అంతస్తుల ఇల్లు, 5కార్లు, కావలిలో 32 ఎకరాల స్థలం కూడా ఉండేదట.అయితే వెండితెరపై చూపించిన క్రూరత్వం, వికట్టహాసం కారణంగా బయట కూడా జనం భయపడిపోయేవారట .అలా 1968లో వరకట్నం సినిమా షూటింగ్ జంగారెడ్డిగూడెం, తాడిపల్లి గూడెం పరిసరాలు షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ కృష్ణకుమారితో మాట్లాడుతున్న అక్కడి మహిళలు రాజనాలని చూసి భయంతో పరుగులు పెట్టారట.ఇదొక్కటి చాలు రాజనాల సిల్వర్ స్క్రీన్ పై ఎలా చెలరేగిపోతారో చెప్పడానికి.
1971లో మొదటి భార్య శోభ 32 ఏళ్లకే
అయితే నిజజీవితంలో మాత్రం ఆయన ఎంతో దానగుణం కలిగిన వ్యక్తి.మద్రాస్ టి నగర్ లో నివాసంలో రోజు కనీసం పాతికమందికి తక్కువ కాకుండా అన్నదానం చేసేవాడట రాజనాల .అందుకే ఆయన ఇంటికి “రాజనాల సత్రం” అని పిలిచేవారట. ఇక ఆయన మొదటి భార్య శోభ వచ్చిన వారందరికీ వడ్డించే అన్నపూర్ణమ్మ లా మారిపోయేది .షూటింగ్లో ఉన్నప్పుడు కూడా పదిమందికి సరిపడా భోజనం ఆయన ఇంటి నుంచి వచ్చేదట.పేద విద్యార్థులకు డబ్బు సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారట.కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.1971లో మొదటి భార్య శోభ 32 ఏళ్లకే చనిపోవడంతో రాజనాల బాగా డిసప్పాయింట్ అయిపోయాడు.ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమయ్యాడు .ఇక ఎన్టీఆర్ స్వయంగా వచ్చి పరామర్శించి అన్ని కార్యక్రమాలని దగ్గర ఉండి చూసుకోవడం విశేషం.పిల్లలు చిన్నవారి కావడంతో భూదేవిని రెండో వివాహం చేసుకున్నాడు రాజనాల .1972లో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం తర్వాత పరిశ్రమకు కొత్త విలన్స్ రావడంతో రాజనానికి అవకాశాలు తగ్గాయి.
దీనికి తోడు 1984లో తన కుమారుడు మూర్ఛ వ్యాధితో చనిపోగా మరో కుమారుడు ముంబైలో తప్పిపోయాడు .ఇక వచ్చిన డబ్బును ఇష్టం వచ్చినట్టు దానం చేయడంతో ఆస్తి అంతా కరిగిపోయింది.అయినప్పటికీ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, చాణక్య చంద్రగుప్త సినిమాల్లో పాత్రలు ఇచ్చి ఆదుకున్నారు.ఇక కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో మంచి వేషం ఇచ్చాడు.అయినా ఆర్థిక కష్టాలు పెరగడంతో కూతురు ,అల్లుడు పై భారం కావడం ఇష్టం లేక 1991లో తన ఆస్తులని అమ్మేసి హైదరాబాద్ వచ్చేసాడు రాజనాల.ఒకానొక దశలో చేతిలో రూపాయి లేక గతంలో తాను అవమానించిన నటుడు శోభన్ బాబు ఇంటికి సహాయం కోసం వెళ్లగా ఆయన అప్పటి పగలు మనసులో పెట్టుకోకుండా 20,000 ఇచ్చి పెద్ద మనసుని చాటుకున్నాడు.చివరి రోజుల్లో హైదరాబాద్లో దర్శకులు ఎస్.వి కృష్ణారెడ్డి నెంబర్ వన్ సినిమా అవకాశం ఇవ్వగా, ఇవివి సత్యనారాయణ, హలో బ్రదర్, జైలర్ గారి అబ్బాయి సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు.
రాజనాల చివరి రోజుల్లో బికారిగా
ఇక హీరో కృష్ణ నటిస్తున్న సినిమా తెలుగువీర లేవరా సినిమాలో షూటింగ్ అరకులో జరుగుతున్న సందర్భంగా రాజనాల కాడికి పెద్ద దెబ్బ తగిలింది. మధుమేహం కూడా పెరగడంతో ఇన్ఫెక్షన్ అయింది .అలా అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన కుడికాలను తీసేశారు.దాంతో ఇక జీవనం సాగించడానికి తనకి తెలిసిన జ్యోతిష్యాన్ని నమ్ముకొని జాతకాలు చెప్తూ కడుపు నింపుకున్నాడు రాజనాల.ఏదేమైనా కోట్లకు అధిపతిగా ఉన్న రాజనాల చివరి రోజుల్లో ఒక కాలు లేక జ్యోతిష్యుడుగా మారి జీవనం సాగించడం బాధాకరం.అలా బతుకుతూ రాజనాల 1998 మే 21న గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 73 ఏళ్ల వయసులో చనిపోయారు.ఇక ఆయన ఆస్పత్రి బిల్లు దాదాపు ఒక లక్ష 80 వేల బిల్లు కాగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ డబ్బులతో దానిని చెల్లించి ప్రత్యేక వాహనంలో రాజనాల మృతదేహాన్ని హైదరాబాద్ కి తరలించారు.ఇక అనే ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన రాజనాలది ఏది ఏమైనా తెరపై విధముగా కనిపించిన రాజనాల జీవిత చరమాంకంలో కనిపించి కోటి రూపాయలు వెనకేసిన రాజనాల చివరి రోజుల్లో బికారిగా చనిపోవడం బాధాకరం
మూర్ఛ వ్యాధితో మరణించగా, మరో కుమారుడు ముంబైలో అదృశ్యమయ్యాడు. వచ్చిన డబ్బును వచ్చినట్టు దానం చేయడంతో ఆస్తంతా కరిగిపోయింది. అయినప్పటికీ ఎన్టీఆర్ ‘దానవీర శూరకర్ణ’, ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రాల్లో పాత్రలు ఇచ్చి ఆదుకున్నారు. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో మంచి వేషం ఇచ్చారు. ఆర్థిక కష్టాలు పెరగడంతో కూతురు, అల్లుడిపై భారం కావడం ఇష్టం లేక 1991లో మద్రాసు ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్ వచ్చేశారు. ఒకానొక దశలో చేతిలో రూపాయి లేక, గతంలో తాను అవమానించిన నటుడు శోభన్ బాబు ఇంటికే సహాయం కోసం వెళ్లగా, ఆయన పాత పగలు మనసులో పెట్టుకోకుండా రూ. 20,000 ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు.
1998 మే 21న గుండెపోటు రావడంతో మృతి
చివరి రోజుల్లో హైదరాబాద్లో దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి ‘నెంబర్ వన్’, ఇ.వి.వి.సత్యనారాయణ ‘హలో బ్రదర్’, ‘జైలర్ గారి అబ్బాయి’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చారు. హీరో కృష్ణ నటిస్తున్న ‘తెలుగు వీర లేవరా’ చిత్రం షూటింగ్ అరకులో జరుగుతున్న సమయంలో రాజనాల కాలికి తీవ్రమైన గాయమైంది. మధుమేహం పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువవడంతో అపోలో ఆస్పత్రి వైద్యులు ఆయన కుడికాలును తొలగించారు. దాంతో బతుకు బండిని లాగడానికి తనకు తెలిసిన జ్యోతిష్యాన్ని నమ్ముకుని, ప్రజలకు జాతకాలు చెప్తూ కడుపు నింపుకున్నారు. కోట్లకు అధిపతి అయినా, చివరి రోజుల్లో ఒక కాలు లేక జ్యోతిష్యుడిగా మారిన రాజనాల జీవితం సినిమా స్క్రిప్ట్ కంటే భయంకరమైన మలుపులతో ముగిసింది. 1998 మే 21న గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ఆసుపత్రి బిల్లు రూ.1,80,000 కాగా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిధులతో దానిని చెల్లించి, ప్రత్యేక వాహనంలో పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. .ఏది ఏమైనా ఎన్టీఆర్, ఎం.జి.ఆర్, జయలలిత అనే ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన రాజనాల చివరి రోజుల్లో అనాథగా మరణించడం బాధాకరం.