E-Paper
Advertisement

‘లెనిన్’ లో అఖిల్ బ్లైండ్ క్యారెక్టర్? …. అయ్యగారి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడేనా?

‘లెనిన్’ లో అఖిల్ బ్లైండ్ క్యారెక్టర్? …. అయ్యగారి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడేనా?
Advertisement

Akhil Lenin: సినిమాలు తీయడమే తప్ప హిట్టు మొహం చూడలేకపోతున్న అఖిల్ ఈసారి ఎలాగైనా అంటూ లెనిన్ సినిమాని పట్టాలెక్కించాడు. వినరో భాగ్యమే విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అక్కినేని నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా మరో మూడు రోజుల్లో అంటే జులై 10న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది కూడా.

అయితే తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నఒక లీక్ మాత్రం ఇపుడు అక్కినేని ఫ్యాన్స్ కి ముచ్చెమటలు పట్టిస్తుంది.అవును ..ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక క్రేజీ సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారట మేకర్స్. అదేంటో తెలుసా ..హీరో అఖిల్ ఈ సినిమాలో కళ్ళు లేని వాడిగా(అంధుడిగా)కనిపించనున్నాడని ఇన్ సైడ్ టాక్.

Advertisement

కళ్ళు లేని హీరో విలన్స్ ని ఊచకోత కోస్తుంటే

మాములుగా యాక్షన్ సినిమాల్లో ఇలాంటి లోపాలు ఏవైనా ఉంటె సింపతీ రాబట్టాలని సెంటి మెంట్ యాంగిల్ చూపిస్తారు మేకర్స్.కానీ ఈ సినిమాకే ఇదొక హైలెట్ గా ,ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చే మాస్టర్ స్ట్రోక్ ట్విస్ట్ గా ఫీలైపోతూ సంబరపడిపోతున్నారట.అంటే కళ్ళు లేని హీరో విలన్స్ ని ఊచకోత కోస్తుంటే ఆడియన్స్ కళ్ళప్పగించి చూస్తారన్నది మేకర్స్ నమ్మకం కావచ్చు.అయితే ఈ ట్విస్ట్ అలా లీక్ అయిందో లేదో అప్పుడే మీమర్స్ తమా బుర్రలకి పదును పెట్టె పనిలో పడిపోయారు. సినిమాని యాక్షన్ ఫిలిం అని ట్రైలర్ ,అండ్ పోస్టర్స్ ని చూస్తేనే అర్థం అవుతుంది.అలాంటప్పుడు హీరో గుడ్డివాడిగా అంతమందిని ఎలా నరుకుతాడో ,ఏంటో అంటూ లాజిక్ లు తీయడం మొదలెట్టారు.

Advertisement

హీరోతో ఎక్స్పెరిమెంట్స్ చేయించడం అంటే పెద్ద రిస్క్

మొన్నామధ్య అనిల్ రావిపూడి,రవి తేజ కాంబోలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరో కళ్ళు లేని వాడిగా కనిపించి సాలిడ్ హిట్ కొట్టాడు కూడా.అయితే అది పక్కా ఎంటర్ టైన్ మెంట్ ఫిలిమ్.కానీ లెనిన్ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఇదొక ఊరమాస్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా.మరి ఇలాంటి సినిమాలో హీరోతో ఎక్స్పెరిమెంట్స్ చేయించడం అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి.ఎన్ని హంగులున్నా, ఎంత బడ్జెట్ కుమ్మరించినా అంధుడిగా అఖిల్ చేసే ప్రతీ యాక్షన్ సీన్ లాజిక్ మిస్ కాకుండా తీయగలగాలి.అప్పుడే కనెక్ట్ అవ్వగలరు ఆడియన్స్.అలా కాకుండా లాజిక్ లెస్ గా ఉంటె మాత్రం షాక్ అవడం అటుంచి డిస కనెక్ట్ అయిపోతారు.

ఎలా నిలబెట్టుకుంటాడో జులై 10న తేలిపోనుంది

మరి వైపు అఖిల్ కూడా ఇప్పటికే వరుస ప్లాపులని మూటగట్టుకున్నాడు.అలాంటి ఈ సమయంలో ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ అవసరమా అంటూ హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు.మరో వైపు అయ్యగారి అభిమానులు కూడా మళ్ళీ గుడ్డిగా ఈ రిస్క్ అవసరమా అంటూ లోలోపల బాధ పడిపోతున్నారట.చూడాలి మరి నెట్టింట లీక్ అయిన ఈ బ్లైండ్ న్యూస్ పై మేకర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తారో.ఏది ఏమైనా మా “అయ్యగారు నెంబర్ వన్”అంటూ తన పై పెట్టుకున్న అభిమానుల నమ్మకాన్ని ఈ లెనిన్ ఎలా నిలబెట్టుకుంటాడో జులై 10న తేలిపోనుంది !

also read:‘లెనిన్’ పై సెటైర్లు.. అఖిల్ కెరీర్‌ను తారక్ నిలబెట్టగలడా?

Related News

డేరింగ్ స్టంట్స్ చేస్తున్న మెగాస్టార్.. మెగా 158 నుండీ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్!

చిక్కుల్లో పడ్డ కంగనా రనౌత్ క్వీన్ 2..మోసం చేశారంటూ ఆరోపణ!

విద్యార్థులకు అండగా హీరో నిఖిల్.. ట్రస్ట్ పై ఊహించని రియాక్షన్!

హార్మోన్ చికిత్స వల్ల ఎన్నో మార్పులు.. ఒత్తిడి భరించలేకపోయా – కృతి సనన్

ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన కాజల్.. కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం?

‘అమ్మ’కి రేవతి, పద్మప్రియ రాజీనామా..అసలేం జరుగుతోంది?

Tollywood : రీమేక్ లకు దూరంగా ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఆ హీరో ఎంతైనా గ్రేట్..

Big Stories

Advertisement
×