E-Paper
Advertisement

ప్రియుడితో బ్రేకప్.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ!

ప్రియుడితో బ్రేకప్.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ!
Advertisement

Tollywood:సినిమా సెలబ్రిటీలు ఎప్పుడు? ఎవరితో ప్రేమలో పడతారో తెలియదు. అలాగని తమ జీవితాన్ని నచ్చిన వారితో కొనసాగిస్తారా ? అంటే చెప్పలేని పరిస్థితి. నచ్చితే పెళ్లి పీటల వరకు వెళ్తారు.. నచ్చకపోతే ఆ ప్రేమ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ముఖ్యంగా ప్రేమించుకున్న వాళ్లు నిశ్చితార్థం చేసుకొని పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. ఇక ఈ జాబితాలోకి మరో జంట వచ్చి చేరింది అంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వార్తలు దావానంలా పాకిపోతున్న విషయం తెలిసిందే.. దీంతో ఆ సెలబ్రిటీ జంట స్పందించకపోవడంతో రూమర్స్ నిజమే అనే నిర్ధారణకు కూడా అభిమానులు వచ్చేశారు..

నిశ్చితార్థం తర్వాత ప్రియుడితో బ్రేకప్ చెప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్..

ఇక ఈ విషయంపై ఎట్టకేలకు సదరు జంటలోని బ్యూటీ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఆకృతి అగర్వాల్. రాజేష్ నాయుడు దర్శకత్వంలో సన్నీలియోన్, సుమన్, రాజేంద్రన్ కీలక పాత్రల్లో వచ్చిన ‘త్రిముఖ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆకృతి అగర్వాల్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా ఈ చిత్రంతో ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తన అద్భుతమైన నటనతో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమెకు.. ఇప్పుడిప్పుడే వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ప్రతీ రూమర్ నిజమే..

Advertisement

ఆకృతి ఇండస్ట్రీలోకి రాకముందే ప్రముఖ క్రికెటర్ పృథ్వీ షా తో రిలేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక వారి ప్రేమను ముందుకు నడిపిస్తూ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది మార్చి నెలలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఈ వేడుక జరిగిన నాలుగు నెలలకే ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆకృతి పెట్టిన ఒక పోస్ట్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. ఆకృతి తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా.. నేను ఎన్నోసార్లు చీటింగ్ కి గురయ్యాను. అయితే ఏ రోజు కూడా ఒక్క మాట కూడా బయటకు చెప్పలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసేందుకు తీసుకున్న నిర్ణయం తర్వాత కొన్ని విషయాలను నమ్మలేకపోయాను.ప్రతి విషయం నిజమే.. ప్రతీ రూమర్ లో వాస్తవం ఉంది అని ” అంటూ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. క్రికెటర్ పృథ్వీ షా ఈమెను మోసం చేశాడని.. అందుకే నిశ్చితార్థం చేసుకున్న వీరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ALSO READ:డేరింగ్ స్టంట్స్ చేస్తున్న మెగాస్టార్.. మెగా 158 నుండీ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్!

రూమర్స్ పై స్పందించిన ఆకృతి..

Advertisement

ఇక ఇలా పృథ్వి , ఆకృతి విడిపోయారంటూ వస్తున్న వార్తలపై మళ్ళీ ఆకృతి స్పందించింది.” నా కాబోయే భర్తతో విభేదాలు తలెత్తి బ్రేకప్ అయినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆ పోస్ట్ నేను నా క్లోజ్ ఫ్రెండ్ ని ఉద్దేశించి పెట్టింది. అంతేకాకుండా ఒక్క చిన్న పొరపాటు వల్ల నా ప్రేమికుడు పృథ్వీ షా పరువును కోల్పోయే పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉంది” అంటూ రాసుకుంది. మొత్తానికి అయితే ఆకృతి, పృథ్వీ బ్రేకప్ చెప్పుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది ఆకృతి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్, పెట్టిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Related News

కోట్లకు అధిపతి.. చివరికి జాతకాలు చెప్పుకుంటూ…టాలీవుడ్ టాప్ విలన్ జీవితంలో ఇంతటి విషాదమా?

డేరింగ్ స్టంట్స్ చేస్తున్న మెగాస్టార్.. మెగా 158 నుండీ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్!

‘లెనిన్’ లో అఖిల్ బ్లైండ్ క్యారెక్టర్? …. అయ్యగారి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడేనా?

చిక్కుల్లో పడ్డ కంగనా రనౌత్ క్వీన్ 2..మోసం చేశారంటూ ఆరోపణ!

విద్యార్థులకు అండగా హీరో నిఖిల్.. ట్రస్ట్ పై ఊహించని రియాక్షన్!

హార్మోన్ చికిత్స వల్ల ఎన్నో మార్పులు.. ఒత్తిడి భరించలేకపోయా – కృతి సనన్

ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన కాజల్.. కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం?

Big Stories

Advertisement
×