E-Paper
Advertisement

‘అమ్మ’కి రేవతి, పద్మప్రియ రాజీనామా..అసలేం జరుగుతోంది?

‘అమ్మ’కి రేవతి, పద్మప్రియ రాజీనామా..అసలేం జరుగుతోంది?
Advertisement

Mollywood: గత కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేకించి మలయాళం ఇండస్ట్రీలో పురుషాధిక్యత గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎంతోమంది నటీమణులు మలయాళం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అంటూ తమ బాధను వెళ్ళబుచ్చిన నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ నేపథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీ స్థితిగతులను పరిశీలించిన ఆ కమిటీ.. ఆ తర్వాత అందించిన నివేదిక మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసింది. దాంతో హేమా కమిటీ లాంటి కమిటీలు అన్ని భాష ఇండస్ట్రీలలో ఉంటే మహిళలకు ఇబ్బందులు ఎదురవవు అనే కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు హేమా కమిటీ కాదు కదా ఎన్ని కమిటీలు వచ్చినా.. తమ నేమి చేయలేవని.. పురుషాధిక్యత మరొకసారి రుజువు చేసింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

రేవతి , పద్మప్రియ రాజీనామా..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హేమా కమిటీ రిపోర్ట్ తదనంతరం ఏర్పడిన పరిణామాలపై అటు రేవతి, పద్మప్రియ కూడా తీవ్రంగా స్పందించారు. ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత గురించి మళ్ళీ చర్చకు రావడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా) ప్రాథమిక సభ్యత్వానికి దిగ్గజ నటి, దర్శకురాలు రేవతి ఆశా కేలుణ్ణి, వెటరన్ నటి పద్మప్రియ జానకీ రామన్ తాజాగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఉమ్మడిగా ఇంస్టాగ్రామ్ లో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ నిర్ణయాన్ని బాహాటంగా చెప్పేశారు. ఈ నిర్ణయం ఏదో ఒక సంఘటన వల్ల లేదా తొందరపాటుతో తీసుకున్నది కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా సంఘంలో మార్పు కోసం మేము చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఇద్దరు ఉమ్మడిగా స్పష్టం చేశారు.

మహిళలకు సురక్షితమైన వాతావరణం కావాలి..

Advertisement

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటూ..” గత పది సంవత్సరాల కాలంగా మేము అమ్మ సంఘం నుండి ఆడవారికి కనీస అవసరాలు, సురక్షితమైన వాతావరణం కల్పించాలని కోరాము. ముఖ్యంగా మహిళా కళాకారులకు సురక్షితమైన పని వాతావరణం, జవాబుదారీతనం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి కనీస విలువలను మాత్రమే మేము ఆశించాము. ప్రతి సభ్యుడికి దక్కాల్సిన కనీస హక్కులు ఇవే. అయితే ఈ కనీస హక్కుల గురించి ప్రశ్నించినందుకు గాను మాకు తోటి సహా ఉద్యోగుల నుండి , స్నేహితుల నుండి , ఒకప్పుడు సొంత ఇల్లుగా భావించిన పరిశ్రమలోని కొన్ని ప్రాంతాల నుండి కేవలం నిశ్శబ్దం, దూరం మాత్రమే బహుమతిగా లభించాయి.

ALSO READ:మాస్టర్ గేమ్ మొదలుపెట్టిన శివాజీ.. రియల్ లైఫ్ లో అదే స్ట్రాటజీ!

దశాబ్దాల పోరాటానికి మిగిలింది అదొక్కటే..

Advertisement

పైగా హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అమ్మ సంఘంలోని కొంతమంది వ్యక్తులు (మోహన్ లాల్) తమ పదవులకు రాజీనామా చేయడం అనేది ఏదో నైతిక విలువలతో కూడుకున్న చర్య కాదు.. అది కేవలం జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే.. ఈ విషయం నుంచి ప్రజలు, మీడియా దృష్టి కొద్దిగా పక్కకు వెళ్లిన వెంటనే మళ్ళీ పాత పద్ధతులే మలయాళ పరిశ్రమలో రాజ్యమేలుతున్నాయి. అధికారం తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడూ కొత్త మార్గాలను వెతుక్కుంటుంది. ముఖాలు , పద్ధతులు మారిన అసమానతలకు తావిచ్చే వ్యవస్థలు మాత్రం అలాగే ఉన్నాయి” అంటూ వీరిద్దరూ మండిపడ్డారు.

పురుషాధిక్యత ప్రపంచంలో బ్రతకడం కష్టమేనా?

నటీనటులందరి కోసం ఉమ్మడి గొంతుగా నిలవాల్సిన అమ్మ సంఘం ఇప్పుడు పురుషాధిక్యత, అధికార రాజకీయాల చేతుల్లో చిక్కుకుపోయిందని.. దీనివల్ల ఈ సంస్థ స్థాపించిన నాటి ఉన్నత ఆశయాలు పూర్తిగా బలహీనపడ్డాయని ఆరోపించారు. ఈ తరుణంలోనే తాము ఈ సంస్థ నుండి బయటకు రావడం అనేది ఓటమి కాదని ఆత్మగౌరవం అని కూడా స్పష్టం చేశారు. ఇక అంతేకాదు సంస్థలు అనేవి కేవలం ప్రజలు అందులో ఉన్నంత మాత్రాన నిలబడవని, అవి నమ్మకానికి అర్హమైనవిగా ఉన్నప్పుడే వాటి మనుగడను సాగిస్తాయని ఈ ఇద్దరు హితవు పలికారు. మొత్తానికైతే గత దశాబ్దాలుగా ఏదైతే కోరుకున్నామో అది తమకు లభించలేదని.. ముఖ్యంగా పురుషాధిక్యత కారణంగా మహిళలు ఎప్పటికీ అణగారిపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ ఇద్దరి రాజీనామాతో నైనా అమ్మ సంఘంలో మార్పు వస్తుందేమో చూడాలి.

Related News

ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన కాజల్.. కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం?

Tollywood : రీమేక్ లకు దూరంగా ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఆ హీరో ఎంతైనా గ్రేట్..

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్.. 48 గంటల్లోనే ఆ మూవీ బ్యాన్!

హాలీవుడ్ రేంజ్‌లో హనుమత్ సుందరకాండ… మరో ‘మహావతార్ నరసింహ అయ్యేనా ?

యానిమల్ డైరెక్టర్ రూట్ మార్చాడుగా.. వంగా మార్క్ ట్విస్ట్ తో ‘రోమాంచకం’ గ్లింప్స్ అరాచకం!

22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

ఈమధ్య కాలంలో ఇలాంటి పోస్టర్ చూశారా? మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ రికార్డ్!

Big Stories

Advertisement
×