E-Paper
Advertisement

డేరింగ్ స్టంట్స్ చేస్తున్న మెగాస్టార్.. మెగా 158 నుండీ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్!

డేరింగ్ స్టంట్స్ చేస్తున్న మెగాస్టార్.. మెగా 158 నుండీ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్!
Advertisement

Mega158: 70 సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. అటు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు సీనియర్ స్టార్ హీరోలు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. నిత్యం అభిమానులను అలరించాలనే తపనతో.. భిన్నభిన్నమైన జానర్ లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఫ్యామిలీ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మెగా 158 షూటింగ్ అప్డేట్..

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో జోరులో ఉన్న చిరంజీవి. మరిన్ని సినిమాలు ప్రకటించి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే తనకు గతంలో ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. మెగా158 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది.. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది.

రియల్ స్టంట్స్ చేయబోతున్న మెగాస్టార్..

Advertisement

ఇకపోతే బాబి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం.. చిరంజీవి తన వయసును సైతం లెక్కచేయకుండా డేరింగ్ స్టంట్స్ చేయబోతున్నారట. ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్స్ గా పేరు దక్కించుకున్న రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పైగా ఈ ఫైట్ సీను కోసం పెద్ద సంఖ్యలో ఫైటర్లను కూడా రంగంలోకి దించారట. మెగాస్టార్ చిరంజీవిని చాలా పవర్ఫుల్ అండ్ డైనమిక్ లుక్కులో చూపించేలా ఈ ఫైట్ డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ యాక్షన్ ఎపిసోడ్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చిరంజీవి కూడా ఎంతో యాక్టివ్ గా పాల్గొంటూ .. కొన్ని రిస్కీ స్టంట్ లు స్వయంగా చేస్తుండడం విశేషం.

also read:చిక్కుల్లో పడ్డ కంగనా రనౌత్ క్వీన్ 2..మోసం చేశారంటూ ఆరోపణ!

Advertisement

మెగాస్టార్ బర్తడే స్పెషల్..

మరోవైపు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.మెగా 158 టైటిల్ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనగా ఆగస్టు 22న అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు 70 వ సంవత్సరాల వయసులో రియల్ స్టంట్స్ చేస్తున్నారు అని తెలియడంతో థియేటర్లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధం అయిపోయారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

Related News

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

Big Stories

Advertisement
×