Kannappa Movie Collections : టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించారు. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.. ఈ మూవీలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ట్స్ కీలక పాత్రల్లో నటించారు.. మొదటి నుంచి ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా వాయిదా పడుతూ ఉండటంతో మూవీ లవర్స్ పక్కనపెట్టేశారు. నిన్న రిలీజ్ అయిన తర్వాత మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ హాఫ్ సోసోగానే లాక్కొచ్చిన సెకండ్ ఆఫ్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసిందని రివ్యూలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ మూవీ కలెక్షన్స్ పై ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం..
కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్స్..
కన్నప్పకు మొదటి నుంచి ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కానీ థియేటర్లలో రిలీజ్ అయ్యాక టాక్ మారిపోయిందని తెలుస్తుంది. సినిమాను ఇప్పటికే చూసిన చాలామంది ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ గా మాట్లాడుతూ.. సినిమా బాగుందని అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధారణ ఆడియన్స్ సైతం థియేటర్‌లో సినిమా చూసి చూసేందుకు ఆశక్తి చూపుతున్నారు. కాగా ఇప్పటికే కన్నప్ప.. విష్ణు కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపినింగ్స్ దక్కించుకుంది. కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేసిందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పటికే కన్నప్పకు వచ్చిన టాక్‌తో కన్నప్ప ఫస్ట్ డే దాదాపు రూ. 16 కోట్లకు పైగా కలెక్షన్‌లు కొల్లగొట్టే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇండియాలో మొత్తం 9.4 కోట్లు వసూల్ చేసిందని టాక్.
వరల్డ్ వైడ్…
ఇప్పటి వరకు ఎస్టిమేట్ ప్రకారం… ఇండియా వైడ్ 9.4 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ ను కలుపుకుని మొత్తం కన్నప్ప వరల్డ్ వైడ్ 13 కోట్ల వరకు వసూళ్లు చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇంకా కన్నప్ప టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. కన్నప్ప లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన గత కొన్నేళ్లుగా హిట్ సినిమా లేని మంచు విష్ణుకు ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..
Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హీరోయిన్ కన్నుమూత..
కన్నప్ప బడ్జెట్ & టార్గెట్ ఎంతంటే..?
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ , స్క్రీన్ ప్లేను అందించారు.. నటులకు, ప్రమోషన్స్ అన్నిటికి కలిపి 120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ట్రేడ్ పంతులు చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేశారు. ఇకపోతేతెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, కర్ణాటకలో రాక్‌లైన్ వెంకటేష్, కేరళలో మోహన్ లాల్‌కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్, హిందీలో జయంతీలాల్ గడా, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్‌టైన్‌మెంట్, మలేషియాలో డీఎంవై క్రియేషన్స్ సంస్థలు కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేశాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని 5250 థియేటర్‌లలో విడుదల చేశారు. మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవాలంటే ఓవరాల్ గా 180 కోట్లను వసూల్ చెయ్యాల్సి ఉంటుంది. చూడాలి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో..