BigTV English

OTT Movie : ఈ దెయ్యం నుంచి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరితో ఆ పని చేయాల్సిందే… అన్నీ అవే సీన్స్

OTT Movie : ఈ దెయ్యం నుంచి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరితో ఆ పని చేయాల్సిందే… అన్నీ అవే సీన్స్

OTT Movie : హారర్ సినిమాలను విజువల్ ఎఫ్ఫెక్ట్స్ , ట్విస్టులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కుతున్నాయి.  కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకుల చేత సీటీ కొట్టిస్తున్నారు మేకర్స్. ఈ మధ్య హారర్ జానర్ లో వస్తున్న సినిమాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో ఒక మూవీ డిఫరెంట్ కంటెంట్ తో నడుస్తోంది. ఇందులో ఒక శాపం ఉన్న మనిషి, ఎవరితోనైనా ఏకాంతంగా గడిపితే ఆశాపం వాళ్ళకు అంటుకుంటుంది.  క్లైమాక్స్ లో ఈ స్టోరీ మరో లెవెల్ కి వెళ్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ మూవీ పేరు ‘ఇట్ ఫాలోస్’ (It Follows). 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాకి డేవిడ్ రాబర్ట్ మిచెల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మైకా మన్రో, కీర్ గిల్‌క్రిస్ట్, డానియల్ జోవాట్టో, జేక్ వీరీ, ఒలివియా లుక్కార్డి, లిలీ సీప్ నటించారు. ఈ సినిమా 2014 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 2015 మార్చి 27న విడుదల అయింది. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఒక కల్ట్ క్లాసిక్‌గా మారింది. 1 గంట 40 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.8/10 రేటింగ్ ఉంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

జే హైట్ అనే కాలేజ్ విద్యార్థి తన కొత్త బాయ్‌ఫ్రెండ్ హ్యూతో కలసి డేట్‌కు వెళుతుంది. వీళ్ళిద్దరూ మొదట ఒక సినిమా థియేటర్‌కు వెళతారు. అక్కడ హ్యూ ఒక యువతిని జే కి చూపిస్తాడు. కానీ జే ఆమెను చూడలేకపోతుంది. హ్యూ భయపడి వెంటనే బయటకు వెళ్లాలని ఆమెతో చెప్పి, ఒక కారులో ఏకాంతంగా కలుస్తారు. అయితే ఆ తర్వాత హ్యూ జేను క్లోరోఫామ్‌తో అపస్మారక స్థితిలోకి తీసుకెళతాడు. జే కి మెళుకువ వచ్చాక ఒక వీల్‌చైర్‌కు కట్టివేయబడి ఉంటుంది. ఇప్పుడు హ్యూ ఆమెకు ఒక భయంకరమైన రహస్యాన్ని చెప్తాడు. జే, హ్యూతో ఏకాంతంగా గడిపిన తరువాత ఆమెకు హ్యూ ఒక శాపాన్ని అంటించాడు. ఈ శాపం ఒక సూపర్‌నాచురల్ రూపంలో ఉంటుంది. ఇది ఏ రూపంలోనైనా ఆమెకు కనిపించవచ్చు. ఇక జేను ఆ దుష్ట శక్తి నిరంతరం వెంబడిస్తుంది. ఒకవేళ ఈ దుష్ట శక్తి జేను పట్టుకుంటే, ఆమె చనిపోతుంది. ఒక వేల తిరిగి ఈ శాపాన్ని వేరొకరికి అంటిస్తే అది వాళ్ళను వెంబడిస్తుంది. ఇప్పుడు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఆమెకు ఉన్న ఏకైక మార్గం, మరొక వ్యక్తితో ఏకాంతంగా గడపడమే.

ఇప్పుడు ఆ దుష్ట శక్తి జే కి రకరకాల రూపాలలో కనబడుతుంది. దీనిని ఆమె తప్ప ఇతరులు చూడలేరు. ఇది ఆమెకు భయాన్ని మరింత పెంచుతుంది. జే సోదరి కెల్లీ, స్నేహితులు పాల్, యారా, పొరుగువాడు గ్రెగ్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళు మొదట జే చెప్పే మాటలను నమ్మరు. కానీ ఆ దెయ్యం విన్యాసాలను చూసి ఆమె మాటలను నమ్ముతారు. జే, ఆమె స్నేహితులు ఈ దుష్ట శక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. హ్యూ ఈ శాపాన్ని పొందిన తర్వాత దానిని జేకు అంటించాడని, ఆమె కూడా దానిని మరొకరికి అంటించాలని సలహా ఇస్తాడు. గ్రెగ్ ఈ శాపాన్ని నమ్మకపోయినా, జేను రక్షించడానికి ఆమెతో, సంబంధం పెట్టుకుని ఈ శాపాన్ని తీసుకుంటాడు. అయితే గ్రెగ్ ఆ శక్తిని తక్కువ అంచనా వేస్తాడు. చివరికి జే కి ఈ శాపం నుండి విముక్తి లభిస్తుందా ? ఈ శాపంకి ఏమిటి ? ఇంతకీ ఈ దెయ్యం ఎవరు. అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఆన్సర్ షీట్ పై పెన్ పెడితే చేతులు నరికేసే దెయ్యం… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

Related News

OTT Movie : డబ్బుల కోసం అలాంటి వీడియోలో… భార్య ఉండగానే చేయకూడని పని… బెంగాలీ థ్రిల్లర్

OTT Movie : సొంత భార్యనే పరాయి మగాళ్ల దగ్గరకు… నన్ అని కూడా చూడకుండా… మతిపోగోట్టే మలయాళ క్రైమ్ డ్రామా

Friday OTT Movies : మూవీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజు ఓటీటీలోకి 26 సినిమాలు..!

OTT Movie : మనుషుల్ని బంకర్లలో దాచి ఇదేం పాడు పని ? దిక్కుమాలిన డెత్ గేమ్స్… బెస్ట్ సర్వైవల్ మూవీ

OTT Movie : ఓరి నాయనో… మనుషుల్ని మటన్ లా ఆరగించే ఊరు… దీనికంటే నరకమే బెటర్

War 2 OTT : ‘వార్ 2’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..?

Big Stories

×