Kannappa collections: టాలీవుడ్ హీరో మంచు విష్ణు చాలా కాలం తర్వాత కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్లు పరంగా కాస్త వీక్ గానే ఉందని తెలుస్తుంది. ఐదు రోజులకు గాను కలెక్షన్స్ 50 కోట్లు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అంత ఇక్కడ వసూల్ చెయ్యలేదు.. ఓవర్సీస్‌లోనూ కన్నప్ప చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 4.3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.. మరి ఐదు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..
అయ్యో.. ఐదో రోజు దారుణంగా పడిపోయిన కలెక్షన్స్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు.. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో కన్నప్పను గ్రాండ్ రిలీజ్ చేసింది మంచు ఫ్యామిలీ. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే కన్నప్ప చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.. అయితే మూవీకి మొదటి షో నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. నాలుగు రోజులతో పోలిస్తే.. ఐదోవ రోజు మరీ దారుణం అని టాక్.. ఐదు రోజులకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 కోట్ల లోపే వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్స్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా శివయ్య దయ విష్ణు పై పడితే బాగుండు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కన్నప్ప పోస్టర్ తో పోస్ట్ చేస్తున్నారు.
Also Read: ఇదేం ట్విస్ట్.. హిందీలో భారీ ధరకే శాటిలైట్ రైట్స్..!
నార్త్ లో కన్నప్ప బిజినెస్..
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌లతో పాటు కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం కీలకపాత్రలు పోషించారు.. ఇక స్టీఫెన్ దేవస్సి సంగీత సారథ్యం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. ఈ మూవీని విష్ణు ఓన్ గానే రిలీజ్ చేశారు. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ అమ్మలేదు. కానీ ఇప్పుడు నార్త్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. దాదాపుగా 20 కోట్లకు పైగా చెల్లించి ఈ మూవీని కొనుగోలు చేశారట. అయితే ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థలు కొనుగోలు చేసిందోనన్న విషయాన్ని బయటపెట్టలేదు. ఇక ఓటీటీ రైట్స్ ఎంత అన్నది త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.