BigTV English

Kannappa Movie :  ఇదేం ట్విస్ట్.. హిందీలో భారీ ధరకే శాటిలైట్ రైట్స్..!

Kannappa Movie :  ఇదేం ట్విస్ట్.. హిందీలో భారీ ధరకే శాటిలైట్ రైట్స్..!

Kannappa Movie : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. ఎన్నో ఏళ్లుగా షూటింగ్ జరుపుకొని ఇన్నాళ్లకు థియేటర్లలోకి వచ్చేసింది. జూన్ 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఏ మూవీ కలెక్షన్స్ మాత్రం కాస్త తక్కువగానే నమోదు అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ మూవీ 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కాస్త డల్ గానే ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్.. అయితే రెండవ వారం కాస్త మెరుగ్గాని కలెక్షన్స్ ఉన్నాయని సమాచారం.. ఇది పక్కన పెడితే ఈ మూవీకి హిందీ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..


కళ్లు చెదిరే ధరకు హిందీ రైట్స్..

హీరో మంచి విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ఎటువంటి బిజినెస్ డీల్స్ జరగకుండానే ఓన్ గానే విష్ణు థియేటర్లోకి తీసుకొచ్చాడు.. దాదాపుగా ఆరేళ్లు కష్టపడ్డాయి సినిమా ఫలితం దక్కిందని విష్ణు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాటిలైట్ రైట్స్ భారీ ధరకే కొనుగోలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీ కంపెనీతో కన్నప్ప హిందీ వెర్షన్ కి గాను 20 కోట్లు డీల్ తో ముగిసిందట. ఇది పెద్ద మొత్తమే అని చెప్పాలి. ఇక ఓటిటి డీల్ కాకుండా కేవలం శాటిలైట్ హక్కులకే ఇంతమొత్తం అంటే అన్ని ఓటీటీ సంస్థకు మంచి ధర వచ్చే అవకాశం ఉందని టాక్.. ఏది ఏమైనా కూడా ఇంత రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు..


Also Read:బుధవారం టీవీల్లో రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..

అక్షయ్ కుమార్ వల్లే రేటు పెరిగిందా..?

హీరో విష్ణు హీరోగా ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన లేటెస్ట్ డివోషనల్ హిట్ మూవీ “కన్నప్ప”. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సహా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొని విష్ణు కెరీర్లోనే భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది.. నాలుగు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న కన్నప్ప ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇలా ఒక్క బుక్ మై షోలోనే హాఫ్ మిలియన్ కి పైగా టికెట్స్ ని సేల్ చేసుకుంది. ఇది విష్ణు కెరీర్లోనే అత్యధికం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి దిగ్గజాలు నటించగా మోహన్ బాబు కూడా పవర్ఫుల్ పాత్ర పోషించారు. అలాగే తానే ఈ చిత్రానికి నిర్మాణం కూడా వహించారు.. అక్షయ్ కుమార్ వల్లే హిందీ రైట్స్ భారీ ధరకు సేల్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా కన్నప్ప ప్రస్తుతం దూసుకుపోతుంది. మరో రెండు రోజుల్లో నితిన్ తమ్ముడు మూవీ పోటీగా రాబోతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ ని వసూలు చేస్తుందో చూడాలి..

Related News

Sundarakanda Collections : సుందరకాండ మూవీకి 5.5 కోట్ల నష్టం… పాపం నారా రోహిత్ !

OG Movie : ఓజీకి జీరో బజ్.. పవన్ మళ్లీ వీరమల్లు గెటప్ వేయ్యాలేమో?

OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?

Samantha: అందులోనే నెగ్గాలని చూస్తున్న సామ్.. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?

Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!

Tollywood: వెంకీ మూవీ కమెడియన్‌కు తీవ్ర అనారోగ్యం.. పరామర్శించిన మంచు హీరో!

Big Stories

×