Kantara Chapter 1 Posyponed: కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1′. 2022 సెప్టెంబర్లో వచ్చిన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్గా వస్తోంది. ఎలాంటి అంచనాలు లేకండ.. ప్రాంతీయ భాష చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట కన్నడలో రిలీజైన ఈ చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా రూ. 450పైగా కోట్లు వసూళ్లు చేసింది. ఈ దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ మేకర్స్ కాంతార చాప్టర్ 1ని తీసుకువస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ప్రీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది తమిళనాడుకు చెందిన పంజూరిల సంస్కృతిని నేపథ్యంలో రూపొందుతోంది.
అయితే మొదటి నుంచి ఈ సినిమా గురించి రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మూవీ షూటింగ్ కి తరచు అవాంతరాలు రావడం, సెట్లో ప్రమాదాలు జరగడంతో కాంతార: చాప్టర్ 1 తరచూ ఏదోక వివాదంలో నిలుస్తోంది. అంతేకాదు ఈ వరుస ప్రమాదాలు, అడవుల్లో షూటింగ్ కారణంగా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎన్నో అడ్డుంకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్దమౌతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ తాజాగా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంక ఈ కాంతార: చాప్టర్ 1కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగలేదని, వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెండింగ్లో ఉందంటూ కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ రూమర్స్పై కాంతార: చాప్టర్ 1 టీం కూడా స్పందించడం లేదు. సైలెంట్గా ༀ. దీంతో ఈ వార్తలు నిజమేనా అని ఆడియన్స్లో సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు మూవీ రిలీజ్కి ఇంకా నెల రోజులు ఉంది. కానీ, మూవీ టీం సైలెంట్గా ఉంది. ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. కనీసం మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ విడుదల కావాలని. కనీసం పోస్టర్స్ కూడా రావడం లేదు. దీంతో కాంతార: చాప్టర్ 1 వాయిదా పడటం కన్ఫాం అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ తరుణంలో తాజాగా మూవీ టీం ఓ పోస్ట్ వదిలి మూవీ రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా భారత్తో పాటు విదేశాల్లోనూ అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతోందని వెల్లడిస్తూ హొంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.
The untold saga of #Kantara is coming your way 🔥🇬🇧
Experience #KantaraChapter1 in cinemas across 𝐔𝐊 on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐𝐧𝐝, 𝟐𝟎𝟐𝟓..
Releasing by @PharsFilm through #LaughingWaterEntertainment & @TeamDreamZE.@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur… pic.twitter.com/wnFtxoU1zj— Hombale Films (@hombalefilms) September 8, 2025
నార్త్ అమెరికా, యూకేలో కాంతార రిలీజ్ అంతా సిద్దమవుతోందని,ఓవర్సిల్లో ప్రముఖ ప్రొడక్షన్ సంస్థలు కాంతార ప్రీక్వెల్ రిలీజ్ రైట్స్ తీసుకున్నట్టు మేకర్స్ తాజా పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది. ‘కాంతార: చాప్టర్ వన్ రిలీజ్కు రంగం సిద్దమైంది. యూకే వ్యాప్తంగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది. పార్స్ ఫిలీం సమర్పణలో లాఫింగ్ వాటర్ ఎంటర్టైన్మెంట్స్, టీం డ్రీమ్జెడ్ఈలు సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి‘ అంటూ మేకర్స్ ప్రకటించారు. అలాగే ఓవర్సిస్లో ప్రముఖ నిర్మాణ సంస్థ కాంతార రైట్స్ తీసుకుందని, తెలుగు, స్పానిష్ భాషల్లో అక్టోబర్ 2న అక్కడి థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. ఈ ఒక్క పోస్ట్తో మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. కానీ, మూవీ క్రిటిక్స్ మాత్రం సినిమాను వాయిదా వేయక తప్పదు అంటున్నారు. మూవీ రిలీజ్ ఇంకా నెల రోజులే మాత్రమే ఉందని, కానీ.. ఇంతవరకు సినిమాకు ఎలాంటి అప్డేట్.. మూవీ టీం హడావుడి కనిపించడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు.