Jayammu nischayammuraa:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ టాక్ షోలు ఎక్కువగా పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యాంకర్లే కాదు హీరోలు, హీరోయిన్లు కూడా హోస్ట్లుగా మారిపోయి.. తమ తోటి నటీనటులను ఇంటర్వ్యూ చేస్తూ సరదాగా గడపడమే కాకుండా ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే మొన్నటి వరకు రానా (Rana), సమంత (Samantha), బాలకృష్ణ (Balakrishna) ఇలా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు టాక్ షోలు నిర్వహించి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి జాబితాలోకి ప్రముఖ హీరో జగపతిబాబు(Jagapathi Babu) కూడా వచ్చి చేరారు. తాజాగా ఆయన జీ వేదికగా “జయమ్ము నిశ్చయమ్ము రా” అనే ఒక టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున (Nagarjuna) ముఖ్య అతిథిగా ప్రారంభమైన ఈ షో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తోంది.
ఇదివరకే దిగ్గజ దర్శకులు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)వచ్చి సందడి చేశారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు స్టేజ్ పైకి రావడంతో స్టేజ్ మొత్తం కలర్ ఫుల్ గా మారడమే కాకుండా తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయడంతో ప్రోమో కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముగ్గురు సీనియర్ స్టార్ హీరోయిన్లు మీనా(Meena ), సిమ్రాన్ (Simran), మహేశ్వరి (Maheswari ) వచ్చి సందడి చేశారు. వీరితో జగపతి బాబు చాలా చనువుగా మూవ్ అవ్వడమే కాకుండా ఏకంగా బట్టలు టైట్ అవుతున్నాయి అంటూ జాకెట్ విప్పి మరీ వారి ముందు కూర్చోవడం హైలైట్ గా నిలిచింది.
అందరి ముందే జాకెట్ విప్పిన హీరో..
ప్రోమో విషయానికి వస్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ప్రోమో మొదలవ్వగానే మీనా ని చూసి జగపతిబాబు..” నాకు కొంచెం ఆక్సిజన్ కావాలి” అంటూ వెళ్లి ఆమె పక్కన కూర్చుంటాడు. “నన్ను చూసినప్పుడు నువ్వు ఏమనుకున్నావు?” అని జగపతిబాబు ప్రశ్నించగా.. మీనా “ఏమనుకోలేదు”.. అని సమాధానం చెబుతుంది. వెంటనే జగపతిబాబు “నాకు ఆక్సిజన్ అందలేదు “అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. తర్వాత మీనా, సిమ్రాన్ ఇద్దరు కూర్చుని ఉండగా.. ఇద్దరు ఒకే చోట ఉన్నారు అంటూ లేచి మరీ తన జాకెట్ విప్పి పక్కన పడేశారు జగపతిబాబు. పైగా అన్ని బట్టలు వేసుకోకూడదు కదా అంటూ కాస్త తన మాటలకు, డైలాగ్స్ కి రొమాన్స్ జోడించారు జగపతిబాబు. మధ్యలో మహేశ్వరి మీనా గురించి చెబుతూ ఉండగా నేను అమాయకురాలని అంటూ మీనా కామెంట్ చేసింది.
హీరో గారి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ముగ్గురు భామలు..
మీనా మాట్లాడుతూ.. “మేము మీకోసం ఒక స్మాల్ సర్ప్రైజ్ ను చూపించబోతున్నాం” అని చెప్పగా టకీలానా? ఓట్కానా? అంటూ అడిగారు జగపతిబాబు. దీని తర్వాతే అది అంటూ మళ్ళీ కౌంటర్ ఇచ్చింది మీనా. అలా ఒకేసారి ముగ్గురు హీరోయిన్స్ తో జగపతిబాబు రొమాన్స్ డైలాగ్స్ తో ప్రోమోకి మరింత హీట్ పుట్టించారని చెప్పవచ్చు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక వీరిని చూసిన నెటిజన్స్ మాత్రం ఎవర్గ్రీన్ హీరోయిన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
also read:Raashi khanna: రాశి ఖన్నా భావోద్వేగ పోస్ట్.. జీవితాంతం గుర్తుండిపోతాయంటూ!