Anudeep Kv: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ కథ ఉండదు. కానీ ఆ సినిమాలు మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తాయి. చాలామంది దర్శకులు అద్భుతమైన సినిమా తీయాలి ఇండస్ట్రీ హిట్టు కొట్టాలి అని ఆలోచిస్తుంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మూడు గంటల పాటు నవ్వించాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తారు. కేవలం నవ్వించడం మాత్రమే టార్గెట్ గా పెట్టుకుంటారు.
అలా ప్రస్తుతం ఉన్న తెలుగు దర్శకులలో అనుదీప్ కేవీ ఒకడు. అనుదీప్ కేవి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. వాటిలో జాతి రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. జాతి రత్నాలు సినిమాలో కూడా చెప్పుకోదగ్గ కథ ఉండదు. అసలు హీరోలకు ఏం చెప్పి ఒప్పించాడు అని అనుమానం కూడా వస్తుంది. అనుదీప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు హీరో తేజ సజ్జ.
అనుదీప్ సరిగ్గా కథ చెప్పడు. కథలో ఉన్న జోకులు చెప్తాడు. అలానే మిడ్ పాయింట్ చెప్తాడు. ఇంతే మామ కదా ఇంతకుమించి ఇంకేం ఉండదు అంటూ మాట్లాడుతాడు. వాస్తవానికి జాతి రత్నాలు సినిమా కథను తేజ కూడా చెప్పాడు అనుదీప్. అయితే జాతి రత్నాలు సినిమా కథను తనకు ఎలా చెప్పాడో తేజ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. సినిమా కథ ఏమీ చెప్పలేదు. ఒక ముగ్గురు కూర్చుని జీన్ ప్యాంటు మన ఊర్లో మొదటి ఎవరు వేశారు అని మాట్లాడుకుంటారు అది జోక్ మామ. అక్కడ కామెడీ మామ అని చెప్పాడు. కానీ థియేటర్లో నేను ఆ సీన్ చూసినప్పుడు విపరీతంగా పడి పడి నవ్వాను. సీన్ అలా చెప్పినప్పుడు దానిని మనం ఎలా జడ్జి చేయగలుగుతాం.
వాస్తవానికి ఆ సినిమా ఎవరికి చేరాలో వాళ్లకు చేరింది. నవీన్ పోలిశెట్టి అనుదీప్ టైమింగ్ నమ్మి సినిమాను ముందుకు తీసుకెళ్లిపోయాడు. అలానే స్లాంగ్ కూడా పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. కేవలం నవీన్ పోలిశెట్టి మాత్రమే ఆ సినిమాకు న్యాయం చేయగలడు అని చూసిన తర్వాత అనిపించింది. జాతి రత్నాలు సినిమా నేను మిస్ చేసుకున్నందుకు పెద్దగా బాధపడలేదు ఎందుకంటే తినే మెతుకు మీద మన పేరు రాసి ఉన్నట్లు ఎవరు చేయాల్సిన సినిమా వాళ్లకి ఉంటుంది అంటూ తేజా సజ్జ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలానే అనుదీప్ కేవి ఎలా మాట్లాడుతాడు ఇమిటేట్ కూడా చేశాడు.
Also Read: Rag Mayur: రాగ్ మయూర్ తో సినిమా చేయనున్న డిజె టిల్లు దర్శకుడు