Kantara Chapter 1: కాంతార (Kantara).. కన్నడ భాషా ప్రాంతీయంగా వచ్చిన ఈ సినిమా అక్కడ సంచలనం సృష్టించి.. ఆ తర్వాత పలు భాషలలో డబ్బింగ్ అయ్యి దేశవ్యాప్తంగా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది. అలాంటి సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాంతారలో ప్రస్తుతం ఏం జరిగింది అనే విషయాన్ని చూపించారు. కానీ కాంతార 2లో రాజుల యుద్ధాలు, యువరాణి ప్రేమ కథ చూపించబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీన భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి U/A 16+సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. 2 గంటల 48 నిమిషాల రన్ టైం తో థియేటర్లలో సందడి చేయనుంది. ఇకపోతే 16 ప్లస్ మాత్రమే అని మెన్షన్ చేయడంతో చిన్నపిల్లలకు ఈ సినిమా చూసే అవకాశం లేదని అటు పేరెంట్స్ కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారనే మాటలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా.. ఫోక్ టచ్, విజువల్స్ , నేపథ్యం, బీజీఎం, నటీనటుల పర్ఫామెన్స్, మ్యూజిక్ అన్నీ కూడా ట్రైలర్ కి బలాన్ని తీసుకొచ్చాయి. అటు టెక్నికల్ పరంగానే కాకుండా ఇటు ఎమోషన్స్, ఇంటెన్సిటీ పరంగా కూడా ట్రైలర్ హైలెట్ గా నిలిచింది..
ఒక్కో భాషలో ఒక్కో స్టార్ చేత ట్రైలర్ రిలీజ్..
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ తో ‘సలార్’ మూవీ చేసిన ప్రభాస్(Prabhas ) చేతుల మీదుగా తెలుగులో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అటు తమిళంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan), హిందీలో హృతిక్ రోషన్(Hrithik Roshan), మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చేత ట్రైలర్ లాంచ్ చేయించి.. ట్రైలర్ కి ఊహించని హైప్ తీసుకొచ్చారు చిత్ర బృందం. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మాస్ ఇంటెన్స్ డ్రామాకు తగిన లెంగ్త్ కావడంతో ఇందులో కటింగ్స్ లేవు అని సమాచారం. ఇకపోతే రిషబ్ శెట్టి స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది.
ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే..
రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తోంది. విలన్ గా గుల్హన్ దేవయ్య నటిస్తున్నారు. అలాగే జయరాం, రాకేష్ పూజారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మరో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. అక్టోబర్ 2వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి