Haris Rauf’s wife : ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ కీలక ఆటగాడి భార్యకు ప్రమాదం సంభవించింది. పాకిస్తాన్ ఆటగాడు హారీస్ రవూఫ్ భార్య మజ్ఞా మసూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. నిన్న టీమిండియా పై ఆమె కాస్త ఓవర్ గానే మాట్లాడింది. పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంతో ఉన్నానని.. ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య మజ్ఞా మసూద్ తెలిపింది. సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా రవూఫ్.. ఆపరేషన్ సింధూర్ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేశాడు. దీనిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ముజ్ఞా.. “గేమ్ ఓడిపోయాం.. కానీ యుద్దం గెలిచాం” అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు.
Also Read : SL VS PAK : ఆసియా కప్ లో నేడు శ్రీలంక-పాక్ మధ్య పోరు.. చావో రేవో..!
మరోవైపు టీమిండియాను ఎలా పడితే అలా అంటే..? ఇలాగే అవుతారు అంటూ సోషల్ మీడియాలో ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా టీమిండియా-పాక్ ఆటగాళ్లు తిట్టుకోవడం.. ఒకరిపై మరొకరూ సెటైర్లు వేసుకోవడం.. పాక్ ఓపెనర్ ఫర్హాన్ పహల్గామ్ దాడుల బాధితులను అవమానపరచడం.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ‘ఆపరేషన్ సింధూర్’ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేయడం.. అందుకు టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ సమాధానం చెప్పారు. దీంతో మనోడు చేసేది ఏమి లేక టీమిండియా ఫ్యాన్స్ అరుపులకు చెవులు మూసుకున్నాడు. ఇండియాతో పెట్టుకుంటే అట్టుంటది అని సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు ఫ్యాన్స్.
అయితే వాస్తవానికి మజ్ఞా మసూద్ కి ఇస్లామాబాద్ లో ఇవాళ రోడ్డు యాక్సిడెంట్ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. హారీస్ రవూఫ్ భార్య కాస్త ఓవర్ గా మాట్లాడటంతో.. ఆమెకు ప్రమాదం జరిగినట్టు ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా రవూఫ్.. ఆపరేషన్ సింధూర్ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేశాడు. దీనిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ముజ్ఞా.. “గేమ్ ఓడిపోయాం.. కానీ యుద్దం గెలిచాం” అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఇండియా మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ రవూఫ్ ఓవర్ యాక్షన్ చేశాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ.. రఫెల్ జెట్ ను కూల్చేశామని అర్థం వచ్చేలా సంజ్ఞ చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము భారత్ రఫెల్ ను కూల్చేశామని.. పాకిస్తాన్ అబద్దాలు ప్రచారం చేసింది.