BigTV English

OTT Movie : పోలీస్ స్టేషన్ లో ట్యూషన్… అమ్మాయితో అలాంటి పని… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పోలీస్ స్టేషన్ లో ట్యూషన్… అమ్మాయితో అలాంటి పని… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మలయాళం సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు ఆ దర్శకులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలైతే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్, గతనెల థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) అనే  పోలీస్ ఇన్‌స్పెక్టర్, పోలీస్ స్టేషన్‌ను ట్యూషన్ సెంటర్‌గా మార్చడంతో స్టోరీ మొదలవుతుంది. అలాగే ఒక విద్యార్థి జీవితంలో దారుణ సంఘటన కారణంగా, ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుంది. మొత్తానికి ఈ సినిమా వర్త్ వాచింగ్ అనిపించుకుంటోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో ఉందంటే?

‘”సూత్రవాక్యం” (Soothravakyam) మలయాళ కామెడీ-సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఇది యూజిన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. శ్రీకాంత్ కంద్రగుల నిర్మాణంలో వచ్చింది. ఈ సినిమా 2025 జూలై 11న థియేటర్లలో విడుదలై, ఆగస్టు 21 నుండి లయన్స్‌గేట్ ప్లేలో మలయాళం, తమిళం, కన్నడం, హిందీ డబ్బింగ్ వెర్షన్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ETV విన్‌లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో (క్రిస్టో జేవియర్), విన్సీ అలోషియస్ (నిమిషా), దీపక్ పరంబోల్ (వివేక్), శ్రీకాంత్ కంద్రగుల, అనఘ అన్నెట్ (ఆర్య), నసీఫ్ పిపి (అఖిల్) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 8.7/10 రేటింగ్ ని కూడా పొందింది.


కథలోకి వెళ్తే

కేరళలోని పలక్కడ్‌లోని ఒక గ్రామంలో, క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) ఒక సబ్-ఇన్‌స్పెక్టర్. తన పోలీస్ స్టేషన్‌ను విద్యార్థుల కోసం ఉచిత మ్యాథ్స్ ట్యూషన్ సెంటర్‌గా మార్చి, స్థానిక యువతకు స్ఫూర్తినిస్తాడు. దీంతో అదే ఊరిలో గణిత ఉపాధ్యాయురాలైన నిమిషా (విన్సీ అలోషియస్)తో ఆయనకు విభేదాలు వస్తాయి. ఆమె విద్యార్థులు క్రిస్టో చెప్పే తరగతులకు అటెండ్ అవుతారు. అతను చెప్పే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో, అందరూ క్రిస్టో చెప్పే చదువుని ఇష్టపడతారు. ఇక నిమిషా తరగతులు ఖాళీ అవడంతో, ఆమె నిరాశకు గురవుతుంది.

కథ మొదట ఈ కామెడీ డైనమిక్స్, విద్యార్థులతో క్రిస్టో ఆప్యాయతతో నడుస్తుంది. కానీ ఆర్య అనే ఒక విద్యార్థినిని, ఆమె అన్న వివేక్ దారుణంగా కొట్టడంతో కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె అఖిల్ అనే అబ్బాయితో సన్నిహితంగా ఉండటంతో, వివేక్ ఆమెపై కోపంతో ఉంటాడు. క్రిస్టో ఈ దౌర్జన్యాన్ని చూసి, వివేక్‌ను పోలీస్ స్టేషన్‌లో చెంపదెబ్బ కొడతాడు. ఇది గ్రామంలో ఒక నేరానికి దారితీసే పరిస్థితికి తీసుకెళ్తుంది.

ఇప్పుడు ట్యూషన్ సెంటర్‌గా ఉన్న పోలీస్ స్టేషన్, ఒక దర్యాప్తు కేంద్రంగా మారుతుంది. గ్రామంలో జరిగిన నేరంతో కథ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుంది. క్రిస్టో ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ విద్యార్థుల పట్ల అతని ఆప్యాయత, అతన్ని ఒత్తిడిలో పడేస్తుంది. ఇక క్లైమాక్స్ మలయాళం సినిమాలకు తగ్గట్టే ఉంటుంది. ఈ గ్రామంలో ఎలాంటి నేరం జరుగుతుంది ? క్రిస్టో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు ? పోలీస్ స్టేషన్ మళ్ళీ ట్యూషన్ సెంటర్‌గా మారుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మలయాళం సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : రాత్రికి మాత్రమే వచ్చిపోయే చందమామ… పెళ్లి వద్దు అదే ముద్దు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : కొడుకు గర్ల్ ఫ్రెండ్ తో తండ్రి.. ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా అయ్యా ? అన్నీ అవే సీన్లు

OTT Movie : బాబా భాస్కర్ అరాచకం… వయోలెన్స్ తో పాటు ఆ సీన్లు కూడా… ఇంత ఓపెన్ గా చూపించారేంటి భయ్యా ?

Trail OTT: కాజోల్ ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

Big Stories

×