BigTV English

OTT Movie : బాబా భాస్కర్ అరాచకం… వయోలెన్స్ తో పాటు ఆ సీన్లు కూడా… ఇంత ఓపెన్ గా చూపించారేంటి భయ్యా ?

OTT Movie : బాబా భాస్కర్ అరాచకం… వయోలెన్స్ తో పాటు ఆ సీన్లు కూడా… ఇంత ఓపెన్ గా చూపించారేంటి భయ్యా ?

OTT Movie : 1980 నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో, ఒక తెలుగు సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల చివరిలో ఓటీటీలోకి రాబోతోంది. ఇది జానపద కథల ఆధారంగా రూపొందింది. మహాబలిగా చెప్పుకునే ఒక వ్యక్తి, గ్రామంలో ఎంట్రీ ఇవ్వడంతో స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా 1980ల గ్రామీణ జీవన శైలితో, సస్పెన్స్‌ థ్రిల్లర్ కథనంతో, ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. ఇది చిన్న సినిమానే అయినా, పెద్ద కంటెంట్ తోనే వచ్చింది. ఇక ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలోకి రవి అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. తాను దయాగుణం, శక్తి కలిగిన పౌరాణిక రాజు మహాబలి వంశస్థుడినని చెప్పుకుంటాడు. ఇక అక్కడ రవి స్థానిక వివాదాలను పరిష్కరించి, పేదలకు సహాయం చేస్తూ గ్రామస్థుల నమ్మకాన్ని త్వరగా గెలుచుకుంటాడు. “మహాబలి” అనే బిరుదును కూడా సంపాదిస్తాడు. అయితే అతని రాకతో గ్రామంలో ఒక వరుస దొంగతనాలు, ఒక హై-ప్రొఫైల్ హత్య జరుగుతాయి. ఇవి పోలీస్ అధికారి శంకర్ దృష్టికి వస్తాయి. శంకర్ లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసినపుడు స్థానిక జమీందార్ వెంకట రావు, అతని కోడలు లక్ష్మి ఒక పథకంలో ఉన్నట్లు తెలుసుకుంటాడు. రవి ఒక రక్షకుడా లేక మహాబలి ఇతిహాసాన్ని సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వ్యక్తా అనే సందేహంలో కథ సస్పెన్స్‌ తో నడుస్తుంది.


స్టోరీ నడిచేకొద్దీ సస్పెన్స్ తో వచ్చే ట్విస్టులు కథని ఉత్కంఠభరితంగా మారుస్తాయి. రవికి ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్ తో సంబంధం ఉన్నట్టు శంకర్ కనిపెడతాడు. మరోవైపు లక్ష్మి కుట్రలు, వెంకట రావు దురాశ గ్రామంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి. ఇప్పుడు శంకర్, రవి మధ్య జరిగే సీన్స్ చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ కథ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. రవి ఎందుకు ఆ గ్రామంలోకి వస్తాడు ? అక్కడ జరిగే నేరాలకు కారణం ఎవరు ? శంకర్ బయటపెట్టే రహస్యాలు ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

ఎందులోకి రాబోతోందంటే

‘మహాబలి 1980’s’ (Mahabali 1980’s)ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. బొమ్మ సాయికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఆర్‌కె మాస్టర్, బాబా భాస్కర్, లక్ష్మి లక్కీ, రవీంద్ర నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జనవరి 26న థియేటర్లలో విడుదలై, ఆగస్టు 2025 నుండి ఆహా, ETV విన్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఆర్‌కె మాస్టర్ (రవి), బాబా భాస్కర్ (శంకర్), లక్ష్మి లక్కీ (లక్ష్మి), రవీంద్ర నారాయణ్ (వెంకట రావు) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సినిమాకి 7.8/10 రేటింగ్ ఉంది.

Read Also : గడ్డి వాము దగ్గర అడ్డం తిరిగే కథ… థ్రిల్లింగ్ ట్విస్టులున్న తెలుగు మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

Related News

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : కొడుకు గర్ల్ ఫ్రెండ్ తో తండ్రి.. ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా అయ్యా ? అన్నీ అవే సీన్లు

OTT Movie : పోలీస్ స్టేషన్ లో ట్యూషన్… అమ్మాయితో అలాంటి పని… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Trail OTT: కాజోల్ ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

Big Stories

×