BigTV English

Mahesh Vitta: పండంటి కొడుకుకు జన్మనిచ్చిన నటుడి భార్య.. క్యూట్ ఫోటో వైరల్!

Mahesh Vitta: పండంటి కొడుకుకు జన్మనిచ్చిన నటుడి భార్య.. క్యూట్ ఫోటో వైరల్!

Mahesh Vitta: టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా అంటే తెలియని వాళ్ళు ఉండరు.. ఈయన తన కామెడీతో చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి మహేష్ విట్టా తాజాగా తన అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తండ్రి అయినట్టు తాజాగా సోషల్ మీడియా ఖాతాలో ఒక క్యూట్ ఫోటో షేర్ చేసి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ విట్టా చెప్పిన గుడ్ న్యూస్ కి చాలామంది నెటిజన్స్, అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు..


పండంటి కొడుకుకు జన్మనిచ్చిన మహేష్ విట్టా భార్య..

ఇక విషయంలోకి వెళ్తే.. 2023లో తన చెల్లెలు ఫ్రెండ్ అయినటువంటి శ్రావణి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ విట్టా.. పెళ్లయిన 2 ఏళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. రీసెంట్ గానే మహేష్ విట్టా భార్య సీమంతాన్ని ఘనంగా చేశారు. ఈ సీమంతపు ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ కోరారు. ఇక తాజాగా మహేష్ విట్టా భార్య శ్రావణి రెడ్డి పండంటి బాబుకు జన్మనిచ్చింది.


నిద్రలేని రాత్రులు..మురికి డైపర్లు..

ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ..బాబు ఫేస్ రివీల్ చేయకపోయినప్పటికీ బాబు చేయి పట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేసుకుంటూ “ఇప్పటినుండి నిద్రలేని రాత్రులు..మురికి డైపర్లు మొదలయ్యాయి” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు..ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన చాలా మంది సోషల్ మీడియా ఫాలోవర్స్, సినీ సెలబ్రిటీలు మహేష్ విట్టా దంపతులకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి తాజాగా తండ్రి అవ్వడంతో మహేష్ విట్టా ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు.

మహేష్ విట్టా బ్యాక్ గ్రౌండ్

ఇక మహేష్ విట్టా బ్యాక్ గ్రౌండ్ అలాగే సినిమాల విషయానికి వస్తే..మొదట యూట్యూబ్లో ‘ఫన్ బకెట్’ అనే ఛానల్ ద్వారా ఫేమస్ అయిన మహేష్ విట్టా.. ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మరింత ఫేమస్ అయ్యారు. ఇక ఈయన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చూసిన కొంత మంది దర్శకులు మహేష్ విట్టా నటనను మెచ్చి సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు.అలా సినిమాల్లోకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యారు.

మహేష్ విట్టా సినిమాలు..

అలా మహేష్ విట్టా జాంబి రెడ్డి, కొండపొలం, గుణ 369, పేపర్ బాయ్, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా చేసి తన కామెడీతో అందరినీ అలరించారు. అలాగే రీసెంట్గా దర్శకుడిగా మారి ఓ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నట్టు టాక్.. మహేష్ విట్టా కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 3 అలాగే ఓటీటీ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా వచ్చి తన ఆటతీరుతో మెప్పించి మరింత ఫేమస్ అయ్యారు..

ALSO READ:Sailesh kolanu: పాపం పిల్లోడు డైరెక్టర్ గారూ.. ఇచ్చేయకూడదూ.!

Related News

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం మాస్ ప్లానింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

Pradeep Ranganathan: ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, నాకు అలాంటివి చేయాలని కోరిక

Rajesh danda : 17 కోట్లు అనుకుని దిగితే మించిపోయింది, ఆఫీస్ మూతపడుద్ది అన్నారు

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. మంచు లక్ష్మికి సీనియర్‌ జర్నలిస్ట్‌ క్షమాపణలు

Deepika Padukone: దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు!

Kiran Abbavaram: మైత్రి రవి, ప్రదీప్ రంగనాథన్ ఇష్యూపై స్పందించిన కిరణ్ అబ్బవరం

Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?

Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?

Big Stories

×