Bollywood Actor : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో అనుకొని సంఘటనలు ఎదురవుతున్నాయి. కొన్ని మనకి సేఫ్ అనుకున్నది కూడా ప్రమాదంగా కనిపిస్తున్నాయి.. సెలబ్రిటీలు చిన్న విషయానికి కూడా పెద్దగా ఆలోచించి లేనిపోని తలనొప్పులను కొని తెచ్చుకుంటున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు చిన్న విషయాలకే రియాక్ట్ ఈ ప్రాణాల మీదకు తెచ్చుకున్న కొన్ని సంఘటనలు ఈ మధ్య మనకు నిత్యం ఏదో ఒక విధంగా వినిపిస్తున్నాయి. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటి కరిష్మా శర్మ రైలు నుంచి కిందపడిపోయింది.. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి కదిలే రైలు నుంచి ఆమె ఎందుకు దూకేసింది అన్నది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. అందుకు కారణం ఏంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…
బాలీవుడ్ నటి కరిష్మా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినా సరే బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎప్పుడూ హాట్ లుక్ ఫోటోలతో అభిమానులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తాను గాయాల పాలైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. షూటింగ్ కోసమని చర్చి గేట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి రైలు ఎక్కాను. నేనైతే ఎక్కాను కానీ నా స్నేహితులు మాత్రం ఆ ట్రైన్ ని అందుకోలేకపోయారు. కదులుతున్న ట్రైన్ నుంచి నేను దూకేశాను.. ఈ క్రమంలో నాకు వీపుకి తలకు బాగా గాయాలయ్యాయి. నేను త్వరగా కోలుకునేందుకు మీ ప్రేమ , అభిమానం నాకు అవసరం అని ఆ పోస్టులో రాసుకోచ్చారు. ప్రస్తుతం ఆ పోస్తే నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : నటుడు జైకృష్ణ ఆ స్టార్ కమెడియన్ మనవడా..? అస్సలు ఊహించలేదు..
కరిష్మా శర్మ బాలీవుడ్ నటి.. ఈమె మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు ఈమె ఎన్నో సీరియల్స్ సినిమాలు చేసింది.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్ లో నటించింది. రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెర పై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్‌సిలా ప్యార్ కా వంటి సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది.. ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది..