E-Paper
Advertisement

Huzurabad: హుజురాబాద్‌లో ప్రభుత్వ కళాశాల స్థలం ఆక్రమణకు కుట్ర..!

Huzurabad: హుజురాబాద్‌లో ప్రభుత్వ కళాశాల స్థలం ఆక్రమణకు కుట్ర..!
Advertisement

Huzurabad: స్వేచ్చ బ్యూరో: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. కళాశాల పరిధిలోని క్రీడా మైదానాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నిర్జన సమయంలో అక్రమ యత్నాలు..

కళాశాల ఆవరణలో విద్యార్థులు, సిబ్బంది లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఈ కుట్రకు తెరలేపారు. గత మూడు రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రే జేసీబీ సహాయంతో క్రీడా మైదానాన్ని చదును చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ చొరబాటుకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Also Read: నాటి బతుకమ్మ చీరలతో.. అడవి పందులు తోలేవారు.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

చట్టపరమైన చర్యలు తప్పవు

ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆంజనేయరావు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఆయన హెచ్చరించారు. కళాశాల భూమిని ఎవరు ఆక్రమించడానికి ప్రయత్నించినా సహించేది లేదని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు

Advertisement

క్రీడా మైదానంలో జరిగిన అక్రమ చదును ఉదంతంపై ప్రిన్సిపాల్ ఆంజనేయరావు తక్షణమే స్పందించారు. ఈ పూర్తి ఉదంతాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జిల్లా కలెక్టర్‌కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు.

Also Read: Boora Criticism: ఎన్నికల ముందు బట్లర్.. పవర్ రాగానే హిట్లర్.. రేవంత్ రెడ్డి పరిపాలనపై బూర సంచలన వ్యాఖ్యలు!

Related News

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే

పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?

Big Stories

Advertisement
×