Kavya Maran – Anirudh:చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravi Chander) .. ఎట్టకేలకు తన ప్రియురాలు కావ్య మారన్ (Kavya Maran) తో ఎట్టకేలకు గ్రీస్‌లో అంగరంగ వైభవంగా ఏడడుగులు వేశారు. ఇక నేడు చెన్నై వేదికగా సినీ,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి సందర్భంగా.. కావ్య తమ ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఈ కానుక అందుకున్న ఒక ఉద్యోగి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పంచుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన పెళ్లి సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఉద్యోగులకు బంగారు ఉంగరాన్ని ఆమె కానుకగా అందించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఉద్యోగులు అందుకున్న ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ బాక్స్ లో పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన కార్డుతో పాటు చాక్లెట్ బాక్స్ అలాగే బంగారు ఉంగరం ఉన్నాయి. తమకు బంగారు నాణేలు ఇస్తారని భావించామని, కానీ ఉంగరాలు ఇవ్వడంతో ఆశ్చర్యపోయామని ఒక ఉద్యోగి తమ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఉంగరాలను ఎంత మంది ఉద్యోగులకు అందించారు? వాటి బరువు ఎంత ?విలువ ఎంత ? అనే వివరాలపై సన్ గ్రూప్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇకపోతే నేడు సినీ,రాజకీయ క్రీడా రంగాల వారి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించగా.. నవంబర్ 25వ తేదీన ఉద్యోగుల కోసం ప్రత్యేక లంచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారికి అందించిన కార్డులో రాసి ఉంది. మొత్తానికైతే ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తూ కావ్య తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే కావ్య, అనిరుధ్ పెళ్లి సందర్భంగా బంగారు కానుక అందుకున్న ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:ఒకే మూవీకి రెండు సీక్వెల్స్.. ఆసక్తి రేపుతున్న హను-మాన్ కొత్త పోస్టర్!
అనిరుధ్ రవిచందర్ విషయానికొస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన. సూపర్ స్టార్ రజినీకాంత్ కు మేనల్లుడు కావడం గమనార్హం. రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ప్రోత్సాహంతో 3 అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన అనిరుద్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో ఏకంగా 12 కు పైగా ప్రాజెక్టులు ఉండడం గమనార్హం. అందులో కొన్ని అధికారికంగా షూటింగ్ నిర్వహిస్తుండగా.. మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి.