Tarun Bhaskar:తరుణ్ భాస్కర్ ..టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ మరోసారి తన మాటలతో వైరల్ అవుతున్నాడు .సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్లు ఎంత వచ్చాయి, హిట్టా ఫట్టా అనే డిస్కషన్స్ రావడం రావడం కామన్ .
కానీ సినిమా చూసిన ఆడియెన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి ఫీల్‌తో వస్తున్నారన్నదే అసలైన సక్సెస్ అని చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్. తన కొత్త సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఒక ఫిల్మ్ మేకర్‌గా తన లైఫ్‌కు ఈ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుందని తరుణ్ భాస్కర్ ఎమోషనల్ అయ్యారు.
ఈవెంట్‌లో మాట్లాడుతూ, తనకు స్పాట్‌లైట్ అంటేనే కొంచెం టెన్షన్ అని గతంలో ‘పెళ్లి చూపులు’ హిట్ అయినప్పుడు కూడా ఇలాగే నర్వస్ అయ్యానని గుర్తుచేసుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆడుతుందో లేదో అనే టెన్షన్ ఉంటుందని, హిట్ అయ్యాక అసలు ఎందుకు ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందనే మరో టెన్షన్ మొదలవుతుందని సరదాగా చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో ఏ సినిమా తీసినా, ఏం మాట్లాడినా వెంటనే జడ్జ్ చేసేస్తుంటారని, కానీ ఆడియెన్స్ మాత్రం ఎలాంటి ఆలోచనలు లేకుండానే సినిమాలో నిజాయితీ ఉంటే కచ్చితంగా ఆదరిస్తారని చెప్పారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా, కేవలం కథను నమ్మి మనసుపెట్టి ఈ సినిమా చేశామని వివరించారు.
ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీరాములు, సుదర్శన్ థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ తనకు లైఫ్ టైమ్ మెమరీ అని చెప్పారు. 1200 సీట్ల థియేటర్ హౌస్‌ఫుల్ అవ్వడం ఒక ఎత్తయితే, సినిమాలో ట్విస్టులకు జనం రియాక్ట్ అయినా తీరు మరో ఎత్తని అన్నారు.
సాధారణంగా హీరో ఎలివేషన్లకు విజిల్స్, డైలాగులకు చప్పట్లు పడుతుంటాయని, కానీ ఈ సినిమాలో కథ ఎటు తిరుగుతుందో ఆడియెన్స్ ముందే గెస్ చేసి చప్పట్లు కొట్టడం తనకు చాలా కొత్తగా, స్పెషల్‌గా అనిపించిందని తెలిపారు. ఒక డైరెక్టర్‌గా ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏమీ ఉండదని, తన టీమ్ పడిన కష్టానికి జనం ఇచ్చిన ఈ రెస్పాన్సే అసలైన గుర్తింపు అని ఎమోషనల్ అయ్యారు.
లెక్షన్లు, రివ్యూలు, రేటింగ్స్ పక్కన పెట్టి ఒకసారి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని ,థియేటర్ అంటే కేవలం స్క్రీన్ మీద సినిమా చూసి వెళ్లిపోయే ప్లేస్ కాదని, అక్కడ తెలియని వాళ్లు కూడా కలిసి నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ ఒక కమ్యూనిటీలా మారతారని చెప్పారు.
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి చిరునవ్వుతో బయటకు రావడమే నిజమైన సినిమా ఫీల్ అన్నారు. ముఖ్యంగా రాత్రి 10, 11 గంటల షోలకు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుంటే, మళ్లీ థియేటర్లకు పండగ రోజులు వచ్చాయనే నమ్మకం కలుగుతోందని అన్నారు. మొత్తానికి కీడా కోలా వంటి సూపర్ ప్లాప్ తర్వాత సాలిడ్ హిట్ చూడటంతో క్లౌడ్ నైన్ లో తేలిపోతున్నాడు తరుణ్ భాస్కర్ !
also read:హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లా? విశ్వక్ సేన్ ఏమన్నారంటే!