Tollywood Industry : కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ హీరోల అభిమానులు ఆ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అయిన మొదటి రోజే పైరసీ పాలవుతున్న విషయం తెలిసిందే.. ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అయినా సరే పైరసీ భూతం దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో పైరసీని అడ్డుకునేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కానీ ఈ సమస్య మాత్రం పెద్దగా తగ్గినట్లు కనిపించలేదు.. నిన్న మొన్నటి వరకు సినిమాల నుంచి పోస్టర్లు లేదా ఏదైనా వీడియోలు మాత్రమే లీక్ అయ్యేవి కానీ ఇప్పుడు సినిమా మొత్తం ఆన్లైన్ లో ప్రత్యక్షమవ్వడంతో చిత్రయూనిట్ గుండెల్లో గుబులు పుడుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ పైరసీని అడ్డుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ఇండస్ట్రీలు. నిన్న మొన్నటి వరకు పైరసీ భూతం ప్రతాపం తగ్గింది అనుకొని ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు హాయిగా ఉన్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు పైరసీకి గురవడంతో మళ్లీ గుండెల్లో గుబులు పట్టుకుంది. ఇప్పుడు ఏ ఏ సినిమాలు పైరసీకి గురయ్యాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా అయినా సరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే మొదటి రోజే ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో చాలామంది షాక్ అవుతుంటారు. అయితే దీపావళి కానుకగా వచ్చిన సినిమాలకు పైరసీ దాడి జరగలేదని తెలుస్తుంది.. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు పైరసీకి గురవడంతో చిత్ర యూనిట్‌కు కోలుకొని దెబ్బ అని చెప్పాలి. ఆకాశంలో ఒక తార, రణబాలి, ఆదర్శ కుటుంబం, కల్ట్ వంటి సినిమాలు ఒక వెబ్సైట్లో సినీ అభిమానులతో పాటుగా చిత్ర యూనిట్ కూడా షాక్‌కి గురైంది.. ఇటీవలే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాలకు ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఈ పైరసీని గుర్తించిన ఇండస్ట్రీ పెద్దలు ఆయా సినిమాల నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. మొత్తానికి ఆ పైరసీ భూతం పని పట్టేందుకు సినీ ఇండస్ట్రీ కష్టపడింది. ఇక ఆ కష్టానికి ఫలితం కూడా దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి.
పైరసీకి గురైన సినిమాల చిత్ర నిర్మాతలు ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు టాక్.. అదేవిధంగా ఇండస్ట్రీ పెద్దలతో కలిసి చిత్ర నిర్మాతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలో నిర్మాతల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అసలు ఈ సినిమాలను ఎక్కడ రికార్డ్ చేశారు అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తానికి పోలీసులు పైరసీ చేస్తున్న కేటుగాళ్లకు చుక్కలు చూపించారు.. go2.india4movies.click అనే వెబ్సైట్ లో సినిమాలు ప్రత్యక్షం అయ్యినట్లు కనిపెట్టారు. అంతేకాదు కర్నూల్ లో క్యాం కాడర్ ద్వారా వీటిని రికార్డ్ చేసినట్టు ఫిలిం ఛాంబర్ గుర్తించారు. ఫోరెన్సిక్ అనాలసిస్ ద్వారా కర్నూల్ సిటీ స్క్వేర్ మాల్ లో వీటిని క్యాం కాడర్ తో రికార్డ్ అయ్యినట్టు ఆధారాలను సేకరించారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలను ఆన్లైన్లో రిలీజ్ చేసిన వెబ్సైట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇకమీదట పైరసీకి గురికాకుండా సినీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.