Hanuman Movie:ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి ఒకే సినిమాకి రెండు సీక్వెల్స్ రాబోతున్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి విచిత్రమైన పరిణామం బహుశా ఎప్పుడూ జరగలేదు. అయితే ఇప్పుడు అలాంటి ఒక సినిమాకి ఏకంగా రెండు సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి, పాన్ ఇండియా స్థాయిలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న హను-మాన్ ఫ్రాంచైజీ.. ఇప్పుడు ఏకంగా రెండు వేరువేరు ట్రాక్ లుగా విడిపోయింది. దీంతో దర్శకులు ఎవరు? నిర్మాతలు ఎవరు? అనే విషయం టాలీవుడ్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..
జై హనుమాన్ తర్వాత ఒరిజినల్ నిర్మాతలైన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కి అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో ప్రశాంత్ వర్మ ఆ బ్యానర్ నుంచి బయటకు వచ్చి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాంతార సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి (Rishabh Shetty) ప్రధాన పాత్రలో ‘జై హనుమాన్’ చిత్రాన్ని పెట్టాలెక్కించి.. తన సినిమాటిక్ యూనివర్స్ ను ముందుకు తీసుకెళుతున్నారు. అందులో భాగంగానే రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో హనుమాన్ పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
also read:మౌనీరాయ్ సర్జరీ చేయించుకుందా.. విడాకుల తర్వాత నిజాలు బయటపెట్టిన భర్త!
అయితే ఇటు మరొకవైపు సినిమా నుండి దర్శకుడు వెళ్లిపోయినా.. హనుమాన్ లెగసీని వదిలే ప్రసక్తే లేదు అంటూ ఒరిజినల్ నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి , చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో సంచలనానికి తెర లేపారు. అందులో భాగంగానే భారీ, యాంబిషియస్ ప్రాజెక్ట్ ‘హనుమాన్ 2- ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో అధికారికంగా ప్రకటించి. ఇప్పుడు షాక్ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ను రంగంలోకి దించారు. ఫాంటసీ థ్రిల్లర్ కథలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ వి ఐ ఆనంద్ (VI Anand)కి దర్శకత్వ బాధ్యతలు అందించారు ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొత్తానికి అటు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కూడా ప్రెస్టేజియస్ గా తీసుకొని ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు.
మరి రెండు భాగాలుగా రాబోతున్న ఈ సీక్వెల్ ఏ ప్రాజెక్టు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే చిత్రానికి 2 సీక్వెల్స్ వస్తుండడం ఆసక్తికరంగా మారింది . మరి ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.