Director Sukumar : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకు ఉన్న క్రేజ్ వేరే. ఆ డైరెక్టర్లు చేసే సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో హీరోల కన్నా డైరెక్టర్లకే ఎక్కువగా జనాలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లిస్టులో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న డైరెక్టర్ ఎవరు అంటే సుకుమార్.. తనకంటూ ఒక లెక్క ఉంది ఆ లెక్కర్ ప్రకారమే సినిమాలు వస్తాయి అంటూ చాలామంది అభిమానులు ఆయనను ఆకాశానికి ఎత్తిస్తూ ఉంటారు. ఈ డైరెక్టర్ ఇటీవల కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే డైరెక్టర్ సుకుమార్ యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు అంటూ ఒక వార్త వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన లిస్టులో మరొక కొత్త హీరో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ ఏ సినిమాలో చేస్తున్నారు? నెక్స్ట్ ఆయన లిస్టులో ఎంతమంది హీరోలు ఉన్నారు అన్నది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం..
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా సుకుమార్ ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ లాంటి హీరోలు ఆయనతో సినిమాలు చేసి భారీ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే డైరెక్టర్ గా మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్న సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తాని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గారు నిర్మాతగా తన క్రేజ్ ని పెంచుకునేందుకు డిఫరెంట్ రూట్ ని ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా యంగ్ హీరోలు, కొత్త దర్శకుల మీదే ఉంటోంది. కంటెంట్ లో కొత్తదనం ఉంటే చాలు, హీరో తో పనిలేకుండా సినిమాలను చేస్తున్నాడు.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ డైరెక్టర్ నిర్మాతగా మరో హీరో సినిమాను నిర్మించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు టాలెంట్ తో ఇండస్ట్రీలో తన ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చినా కిరణ్ అబ్బవరం. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. ‘పుష్ప’ సినిమాలకు చేసిన వీర కోగటం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారని ప్రచారం జరుగుతోంది.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. రంగస్థలం పుష్ప వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఈ డైరెక్టర్ నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏం హీరోలతో ఈయన చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ నటించిన ‘కుమారి 21ఎఫ్’ తోనే సక్సెస్ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ను ‘ఉప్పెన’ సినిమాతో పరిచయం చేయడంలోనూ సుకుమార్ కీలక పాత్ర పోషించారు.. నిఖిల్ తో ’18 పేజెస్’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నిర్మించి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ నటించిన విరుపాక్షా సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇవి మాత్రమే కాదు బ్యాక్ టు బ్యాక్ బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో మూవీ.. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..