BigTV English

Sai Sudharsan: ఇంగ్లాండ్ పై సాయి సుదర్శన్ క్షుద్ర పూజలు.. ఇక టీమిండియా గెలవడం పక్కా

Sai Sudharsan: ఇంగ్లాండ్ పై సాయి సుదర్శన్ క్షుద్ర పూజలు.. ఇక టీమిండియా గెలవడం పక్కా

Sai Sudharsan:  టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడతాడు అనుకున్న సాయి సుదర్శన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2025 టోర్నమెంట్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు సాయి సుదర్శన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్.. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఐపీఎల్ తరహాలో ఆడడం లేదు సాయి సుదర్శన్. అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.


Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !

మొదటి మ్యాచ్ లో తేలిపోయిన సాయి సుదర్శన్


ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి సాయి సుదర్శన్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సాయి సుదర్శన అద్భుతంగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. టీమిండియా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని.. అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు సాయి సుదర్శన్. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ అలాగే రెండో ఇన్నింగ్స్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు తమిళ కుర్రాడు సాయి సుదర్శన్.

మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు బంతులు ఆడి డక్ అవుట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా అద్భుతంగా రాణిస్తాడు అనుకుంటే 30 పరుగులకే.. ఇంటి దారి పట్టాడు. 48 బంతుల్లో 30 పరుగులు చేసిన సాయి సుదర్శన్ 4 బౌండరీలు కొట్టి టచ్ లోకి వచ్చాడు. కానీ స్ట్రోక్స్ బౌలింగ్లో జాక్ కు అద్భుతమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు సాయి సుదర్శన్.

బ్యాటింగ్ చేతకాదు.. కానీ చేతబడి చేస్తున్నాడు

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన సాయి సుదర్శన్… రెండో ఇన్నింగ్స్ లో రాణించేందుకు ఓ ప్రత్యేకమైన కసరత్తు చేశాడు. బంతితో.. చిన్నపాటి ఎక్సర్సైజ్ చేశాడు. సైంటిస్టు లెవల్లో… బంతిని అటు ఇటు తిప్పుతూ ఏదో ప్రయత్నం చేశాడు. అలాగే తన మిస్టేక్స్ కూడా ఓ నోట్ బుక్ లో రాసుకున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతలా ప్రాక్టీస్ చేశావు కానీ 30 పరుగులు మాత్రమే కొట్టావు కదా సాయి సుదర్శన్… ఏమిరా నీవల్ల టీమిండియా కు ప్రయోజనం అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇక మనోడికి బ్యాటింగ్ చేతకాదు కానీ క్షుద్ర పూజలు చేసిన ఇంగ్లాండ్ టీం ను ఓడించేందుకు.. కుట్రలు పన్నాడని మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?

 

Related News

Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Big Stories

×