BigTV English

King dom – HHVM: ‘కింగ్‌డమ్‌’కు ఇండస్ట్రీ మద్దతు.. వీరమల్లు విషయంలో ఎందుకు మౌనం?

King dom – HHVM: ‘కింగ్‌డమ్‌’కు ఇండస్ట్రీ మద్దతు.. వీరమల్లు విషయంలో ఎందుకు మౌనం?

Kingdom – HHVM: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం “కింగ్డమ్”(King Dom). ఎన్నో అంచనాల నడుమ నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రౌడీ హీరో కం బ్యాక్ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మనం కొట్టినాం అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ సినిమాపై స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఈ సినిమా పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.


కింగ్డమ్ కు సినీ మద్దతు..

ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ నాచురల్ స్టార్ నాని, నాగచైతన్య, రష్మిక వంటి వారందరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మరి కొంతమంది హీరోలు కూడా ఈ సినిమా విజయం పట్ల స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు విష్ణు వంటి వారు కింగ్డమ్ సినిమా పై స్పందిస్తూ పోస్టులు చేయడంతో ఈ సినిమాకు మరింత మద్దతు లభించినట్టు అయింది. ఇలా విజయ్ దేవరకొండ సినిమా విషయంలో సెలెబ్రిటీల స్పందన చూసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


స్పందించని మెగా ఫ్యామిలీ…

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ వరుసగా ప్రమోషన్లను నిర్వహిస్తూ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్క హీరో కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేయ్యలేదు.

మౌనం వహించిన సినీ ఇండస్ట్రీ..

ఇక సినిమా విడుదలకు ముందు సాయి ధరంతేజ్, నిహారిక వంటి వారు మాత్రమే పోస్టులు చేశారు తప్ప మిగిలిన మెగా హీరోలు కూడా ఎవరు ఈ సినిమా విషయంలో స్పందిస్తూ పోస్టులు చేయలేదు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఏ విధమైనటువంటి మద్దతు లభించలేదు దీంతో పవన్ విషయంలో ఎందుకు ఇలా ఇండస్ట్రీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

Also Read: Kalpika: నటి కల్పిక అరెస్టుపై కోర్టు కీలక ఆదేశాలు.. నెక్ట్స్ ఏమిటీ?

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×