Kingdom : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. తీసినవి రెండు సినిమాలు అయినా కూడా అతనికంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. మళ్లీ రావా వంటి ఒక డీసెంట్ లవ్ స్టోరీ ని సుమంత్ లాంటి హీరోతో కూడా చెప్పి సక్సెస్ అయ్యాడు. అప్పటికి సుమంత్ కి సరైన మార్కెట్ లేదు. కానీ ఆ టైంలో హిట్ కొట్టాడు ఈ కొత్త దర్శకుడు.
నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పటికీ కూడా జెర్సీ గౌతమ్ బెస్ట్ వర్క్. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు. జెర్సీలో బాగా వర్కౌట్ అయింది ఎమోషన్స్. ఎమోషన్స్ రాయడమే గౌతమ్ తిన్ననూరి బలం.
ఎందుకు ఈ ప్రయోగాలు.?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి అనగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. అన్నింటిని మించి నాగ వంశీ ఈ సినిమాకు ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్. ఇకపోతే ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ అఫ్ అంత సజావుగానే సాగింది. కొంతమందికి పూర్తిస్థాయిలో నచ్చకపోయినా, ఏంటి ఇలా ఉంది అని తిట్టిన వాళ్ళు మాత్రం లేరు. సెకండాఫ్ బాగుంటే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. అని ప్రాబ్లం అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే మొదలైంది. ఎమోషనల్ గా ఆకట్టుకునే సీన్స్ పెద్దగా పండలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ పైనే గౌతమ్ దృష్టి పెట్టాడు అనిపించింది. ఒక తరుణంలో సినిమా కొద్దిపాటి లాగ్ అని కూడా ఫీల్ వచ్చింది. అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎమోషన్ వదలకూడదు
చాలామందికి గౌతం తిన్న నూరి మీద విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వచ్చిన వాళ్ళకి కొద్దిపాటి నిరసన మిగులుతుంది. విజయ్ కూడా గతంలో ఎప్పుడూ ఈ జోనర్ సినిమా చేయలేదు. అయితే ఈ సినిమాకు కొంతసేపటి వరకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ పాజిటివ్ రెస్పాన్స్ కాస్త మౌత్ టాక్ తో డిఫరెంట్ గా మారిపోయింది. ఏదేమైనా మళ్లీ పర్ఫెక్ట్ కథను తయారుచేసి ఎమోషన్ పట్టుకుంటే గౌతమ్ సినిమాని ఎంకరేజ్ చేయడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ సిద్ధంగానే ఉంటారు. అలానే ఈ సినిమాకి సంబంధించి లీడ్ కి మంచి సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఈ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తే దానిని కొంచెం పగడ్బందీగా చేసి తీరాలి. లేకపోతే బాగుంది అని కొంతమంది దగ్గర మాత్రమే వినిపిస్తుంది తప్ప, యునానిమస్ టాక్ రాదు.
Also Read: Rashmika Mandanna : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాపై రష్మిక మందన రియాక్షన్