E-Paper
Advertisement

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మిథాలజీ ప్రాజెక్ట్… షూటింగ్ ఎప్పటి నుంచంటే ?

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మిథాలజీ ప్రాజెక్ట్… షూటింగ్ ఎప్పటి నుంచంటే ?
Advertisement

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌ లో కీలకమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఆయన హీరోగా ఒక భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ చిత్రం రూపొందుతోంది. ప్రఖ్యాత నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment) జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ తో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావనలపై ఆధారపడిన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. గ్రాండ్ విజువల్స్, భారీ స్కేల్ వరల్డ్ బిల్డింగ్, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. విజువల్ డిజైన్, సెట్ డిజైన్, స్టోరీ బోర్డింగ్, టెక్నికల్ ప్లానింగ్ అన్నీ జరుగుతున్నాయి. షూటింగ్ సెప్టెంబర్ 2026లో ప్రారంభించాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

హీరోయిన్ ఎంపికపై ఆసక్తి

ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ స్కేల్ ప్రాజెక్ట్‌ కు సరిపడే లుక్, పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్‌ ను ఎంచుకునేందుకు మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

కిరణ్ అబ్బవరం రీసెంట్ అప్‌డేట్స్

Advertisement

కిరణ్ అబ్బవరం ఇటీవల విడుదలైన చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. 2024లో విడుదలైన KA ఆయన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. సస్పెన్స్, ఎమోషన్స్, యాక్షన్ మిక్స్‌ తో ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక 2025లో విడుదలైన Dilruba అనే రొమాంటిక్ డ్రామా, K-Ramp అనే రొమాంటిక్ కామెడీ విడుదలై మంచి రెస్పాన్స్ పొందాయి. K-Ramp దీపావళి సమయంలో రిలీజ్ అయ్యి పర్లేదు అన్పించింది. ఇక ఇప్పుడు చేపట్టిన ఈ పాన్-ఇండియా మిథాలజీ ప్రాజెక్ట్ అతని కెరీర్‌లో భారీ లెవల్ అప్‌గా మారనుంది. మిథాలజీ జానర్‌లో భక్తి భావనలు, ఎమోషనల్ డెప్త్, మాస్ యాక్షన్‌ వంటి అంశాలు కలిసి ఉండటం వల్ల ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్కేల్‌లో, అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.

Read Also : ఒకరితో ఒకరికి సంబంధం లేని ఏడుగురు ఒకే హోటల్లో… నరాలు కట్టయ్యే సస్పెన్స్ ఉన్న సినిమా

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

Big Stories

Advertisement
×