Kishkindapuri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) . అల్లుడు శ్రీను సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్ పలు సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో ఆ సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ కూడా ఈయనకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
మనసు మార్చుకున్న కిష్కింద పురి..
ఇక ప్రస్తుతం తెలుగులోనే వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల భైరవం (Bhairavam)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే కిష్కిందపురి(Kishkindapuri) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కౌశిక్(Kaushik) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అదే రోజు తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్(Mirai) సినిమా అదే రోజు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కిష్కిందపురి సినిమాని ఒక రోజు ఆలస్యం చేస్తూ సెప్టెంబర్ 13వ తేదీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
తేజ సజ్జకు పోటీగా బెల్లంకొండ…
సెప్టెంబర్ 13వ తేదీ విడుదలకు సిద్ధమైన కిష్కిందపురి చిత్ర బృందం మరోసారి మనసు మార్చుకొని తిరిగి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. 13వ తేదీ శనివారం అయితే శనివారం సినిమా విడుదల చేస్తే ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వదని, ఆ రోజు సినిమాని కనక విడుదల చేస్తే స్వయంగా సినిమాకు వారే నష్టం చేకూర్చుకున్నవారు అవుతారు. ఈ విషయాన్ని గ్రహించిన చిత్ర బృందం తిరిగి ఈ సినిమాని యధావిధిగా సెప్టెంబర్ 12వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా సెప్టెంబర్ 12వ తేదీ తేజా సజ్జకు పోటీగా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింద పురి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
హర్రర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో …
మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు సక్సెస్ అందుకోబోతున్నారనేది తెలియాల్సిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ మూడో తేదీ విడుదల చేయబోతున్నట్లు అధికారకంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ సినిమా హారర్ మరియు మిస్టరీ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పరదా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ కిష్కిందపురి సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Srinidhi Shetty: వెంకీ మామకు జోడిగా కేజిఎఫ్ బ్యూటీ…మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్టే!