BigTV English

Srinidhi Shetty: వెంకీ మామకు జోడిగా కేజిఎఫ్ బ్యూటీ…మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్టే!

Srinidhi Shetty: వెంకీ మామకు జోడిగా కేజిఎఫ్ బ్యూటీ…మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్టే!

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) కేజిఎఫ్ సినిమాతో సెన్సేషనల్ గా మారిపోయారు. కేజిఎఫ్ (KGF)సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుసగా తెలుగు తమిళ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఇటీవల నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శ్రీనిధి శెట్టికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రియల్ సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వెంకటేష్(Venkatesh) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


వెంకటరమణగా రాబోతున్న వెంకటేష్?

ఈ క్రమంలోనే వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్అయిన సంగతి తెలిసినదే .ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విషయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తిరిగి మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమంలో ఆగస్టు 16వ తేదీ ఎంతో ఘనంగా జరిగాయి. ప్రస్తుత ఈ సినిమా వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతుంది. అయితే ఈ సినిమాకు “వెంకటరమణ” (Venkata Ramana)అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.


వెంకటేష్ సినిమాకు సైన్ చేసిన శ్రీనిధి…

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ,వెంకీ మామకి జోడిగా శ్రీనిధి శెట్టి నటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈమె ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన చేయబోతున్నారు. ఇలా ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించబోతున్నారని విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా శ్రీనిధికి మరొక బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్…

ఇక ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇకపోతే ఇదివరకు వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించడం విశేషం. ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ తిరిగి త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారని తెలియగానే ఈ సినిమాపై మంచి అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఇటీవల వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ప్రకటించడంతో అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Related News

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Kishkindha Puri: కిష్కిందపురి బిజినెస్.. టార్గెట్ చాలా చిన్నదే… కానీ సమస్య ఇదే

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Big Stories

×