E-Paper
Advertisement

Mirai Day 1 Collections : ‘మిరాయ్’ కలెక్షన్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Mirai Day 1 Collections : ‘మిరాయ్’ కలెక్షన్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
Advertisement

Mirai Day 1 Collections : హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. ఒకవైపు పాజిటివ్ టాక్ తో పాటుగా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..

తేజా సజ్జా గత ఏడాది హనుమన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఇప్పుడు విజువల్ వండర్ గా తెరకెక్కిన మిరాయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో నిన్న థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అనుకున్నట్లుగానే థియేటర్లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను బాగా అలరించింది. అంటూ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి షో నుంచి కలెక్షన్ల ఊచకోత మొదలైంది.. తెలుగు రాష్ట్రాల్లో 10.6 కోట్లు, హిందీలో 1.25 కోట్లు, మిగిలిన రాష్ట్రాల్లో 15 లక్షలు వసూల్ చెయ్యగా.. ఒక్క అమెరికాలో 7 లక్షల డాలర్లు వచ్చాయి. అంటే 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది. గతంలో వచ్చిన హనుమాన్ కన్నా ఎక్కువగానే విశేషం.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. వీకెండు ఈ సినిమా కలెక్షన్లు ఇంకాస్త మెరుగ్గా ఉండబోతున్నాయని అంచనా…

Advertisement

Also Read: ప్రభాస్ ‘ రాజాసాబ్ ‘ కు అక్కడ పోటీ తప్పట్లేదే..?

బిజినెస్ & బ్రేక్ ఈవెన్.. 

తేజా గతంలో హీరోగా సినిమాలు చేసిన అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఒక్కసారిగా అతని స్టార్ని చేసింది. ఈ మూవీ ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాతగా వచ్చిన మిరాయ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమాను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించారు. అలాగే రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. టాప్ టెక్నీషియన్లు, మ్యూజిక్, నటీనటుల రెమ్యూనిరేషన్ మొత్తం కలిపి 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాలి.. మొదటిరోజు 18 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. మరి ఈ శని ఆదివారాలు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×