BigTV English

Director Death: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ప్రభాకరన్ కన్నుమూత!

Director Death: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ప్రభాకరన్ కన్నుమూత!

Director Death: చిత్ర పరిశ్రమలో ఒకరి మరణం తర్వాత మరొకరు సీనియర్ నటీనటులు మరణిస్తూ అభిమానులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవుతున్నారు. అందులో భాగంగానే మొదట కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao) అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడువగా.. మరొకవైపు ప్రముఖ సీనియర్ హీరోయిన్ సరోజా దేవి(Saroja Devi) కూడా స్వర్గస్తులయ్యారు. అలాగే బాలీవుడ్ నటుడు ధీరజ్ కుమార్ (Dheeraj Kumar) కూడా కన్నుమూశారు. ఇక ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ప్రభాకరన్ (Prabhakaran ) కూడా కన్నుమూశారు.


ప్రముఖ దర్శకుడు ప్రభాకరన్ కన్నుమూత..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న వేలు ప్రభాకరన్ మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకు గురిచేసింది. వరుస విషాదాలు ఎందుకు సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్నాయి అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే డైరెక్టర్ మృతితో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈయన అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


వేలు ప్రభాకరన్ సినిమా జీవితం..

వేలు ప్రభాకరన్ సినిమా జీవిత విషయానికి వస్తే.. చిత్ర నిర్మాతగా, నటుడిగా, సినిమాటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. ఈయన తన చిత్రాలలో నాస్తికత్వం, విప్లవాత్మక అంశాలను హైలెట్ చేసే ఇతివృత్తాలకు ప్రసిద్ధి చెందినవారు. ఇక 1957 మే 6వ తేదీన తమిళనాడు చెన్నైలో జన్మించారు. 1989లో వచ్చిన హార్రర్ చిత్రం నలయ మనిథన్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈయన అంతకుముందు సినిమాటోగ్రాఫర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఇక తర్వాత ఆర్కే సెల్వమణి నిర్మాణంలో వరుసగా రెండు యాక్షన్ చిత్రాలను నిర్మించారు. ఎక్కువగా విప్లవకారుల పాత్రలతో కూడిన యాక్షన్ చిత్రాల కోసం పనిచేశాడు. ఇక ఆ తర్వాత తమిళంలోని ఎక్కువ చిత్రాలు చేసిన ఈయన ఈ ఏడాది గజానా అనే సినిమాలో కూడా నటించారు. ఇక ఇంతలోనే మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఈయనకు ఉత్తమ సంభాషణ రచయితగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది.

వేలు ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం..

వేలు ప్రభాకరన్ గతంలో ప్రముఖ నటి దర్శకురాలు పి జయదేవీని వివాహం చేసుకున్నారు. కానీ మళ్లీ జూన్ 2017 లో 60 సంవత్సరాల వయసులో తన దర్శకత్వంలో వచ్చిన కాదల్ కథై సినిమా నటి షిర్లీ దాస్ ను మళ్లీ వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు.

also read:Supritha Bandaru: తల్లితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సుప్రీత.. పూజ వెనుక కారణం?

Related News

Kishkindhapuri : హరిహర వీరమల్లు కంటే ఆ విషయంలో బెల్లం అన్న సినిమానే టాప్

Big producer : తన బ్యానర్ లో సినిమాలు చేయమని రాయబారాలు పంపుతున్న బడా నిర్మాత

Tollywood star heroes : చిన్న హీరోల పెద్ద హిట్లు, స్టార్ హీరోలు ఇకనైనా తగ్గండయ్యా

Kangana Ranaut: కంగనాపై సుప్రీంకోర్టు ఫైర్.. పిటిషన్ రద్దు!

Anushka Shetty: వాస్తవ ప్రపంచం అదే.. అనుష్కలో ఈ మార్పుకి కారణం?

Hansika Motwani: హన్సికకు కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ.. అసలేం జరిగిందంటే?

Mirai: మిరాయ్ మూవీపై రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ పోస్ట్.. రూ.1000 కోట్ల క్లబ్ గ్యారెంటీ!

Samyuktha Menon: అమ్మడి రేంజ్ మామూలుగా లేదుగా.. లైనప్ చూస్తే షాక్!

Big Stories

×