Anushka Shetty : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటర్ ఇచ్చింది అనుష్క. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే అనుష్కకు మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.
తెలుగులో చాలామంది స్టార్ హీరోస్ తో కూడా సినిమాలు చేసింది అనుష్క. అయితే అనుష్క అసలు పేరు స్వీటీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ సినిమా చేస్తున్నప్పుడు పూరి అనుష్కను పేరు అడిగాడు. స్వీటీ అని చెప్పింది. పూరి జగన్నాథ్ నమ్మలేదు, పాస్పోర్ట్ తీసి చూపించింది అనుష్క, దాన్లో కూడా స్వీటీ అని ఉంది. అయితే నీకు ముందు పేరు పెట్టాలి అని చెప్పి అనుష్క శెట్టి అనే పేరును పెట్టారు.
ఇకపోతే అనుష్క ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో ట్విట్టర్ స్పేస్ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది అనుష్క శెట్టి.
ఘాటి సినిమాలో శీలావతి అనే క్యారెక్టర్ అమేజింగ్. నేనింతకు ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్రకి మాత్రం చాలా బ్యూటిఫుల్ సేడ్స్ ఉంటాయి. నా కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి నేను ఈ సినిమాను చేశాను. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి సినిమాల్లో నేను చాలా స్ట్రాంగ్ రోల్స్ వేశాను. అలానే ఘాటి సినిమాలు శీలావతి అనే క్యారెక్టర్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది అని అనుష్క శెట్టి చెప్పారు.
గమ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు క్రిష్ జాగర్లమూడి. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తర్వాత చేసిన వేదం సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది. వేదం సినిమాలో సరోజ అనే పాత్రలో కనిపించింది అనుష్క. అనుష్క కెరియర్ లో ఆ పాత్ర ప్రత్యేకం. ఇప్పుడు శీలావతి అనే పాత్రను క్రిష్ ఎలా డిజైన్ చేశాడు వేచి చూడాలి. అయితే క్రిష్ జాగర్లమూడి కంప్లీట్ సక్సెస్ఫుల్ సినిమా కొట్టి చాలా రోజులైంది. ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడేమో సెప్టెంబర్ 5న తెలియనుంది.
Also Read: Yash vs Ranbir Kapoor : రామాయన్ రిలీజ్ కి ముందే, రాముడికి రావణుడికి బాక్సాఫీస్ ఫైట్