E-Paper
Advertisement

Unity: కొండాలక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డ్.. టీమ్ స్పందనిదే!

Unity: కొండాలక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డ్.. టీమ్ స్పందనిదే!
Advertisement

Unity: పుట్టుక, చావు గొప్పగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ మధ్యలో మన గురించి ఈ లోకం నాలుగు మంచి మాటలు చెప్పుకునేలా బతకాలనే సంకల్పంతో.. జననం నుంచి మరణం వరకు ప్రతి గడియను ఆస్వాదించిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji). ఆయన జీవితం ఆధారంగా యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ (Badugu Vijay Kumar) రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం ‘యూనిటీ’ (Unity). ‘ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ అనేది ఉపశీర్షిక. చిరందాస్ శ్రీకాంత్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ (Telangana Gaddar Film Awards)లో సముచితమైన స్థానం దక్కింది. 2025 సంవత్సరానికి గాను వెల్లడించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లోని డాక్యుమెంటరీ విభాగంలో తొలి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గద్దర్ అవార్డును ఈ డాక్యుమెంటరీ సొంతం చేసుకుంది.

Also Read- Jabardasth Varsha: బ్లాక్ అవుట్ ఫిట్ లో హీట్ పెంచిన వర్ష.. ఫోటోలు వైరల్!

తెలంగాణ సమాజానికి మరో గాంధీ!

Advertisement

డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్‌కు జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్న దర్శకుడు విజయ్ కనకమేడల ఎఫ్‌డీసీ కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యాడనే విషయాన్ని ఇందులో చాలా ఆసక్తికరంగా, పెద్దల నుంచి పాఠశాల విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ‘యూనిటీ’ డాక్యుమెంటరీని దర్శకుడు బడుగు విజయ్ కుమార్ చిత్రీకరించారు. మైమ్ మధు, బాలనటుడు భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ బాపూజీ కథను వివరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్‌లో ఇలా వినూత్నమైన పద్దతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ బాల్యం నుంచి మరణం వరకు, ఆ తర్వాత తెలంగాణ సాధన వరకు ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించడం పట్ల జ్యూరీ సభ్యులు సైతం ప్రశంసలు కురిపించారు.

Also Read- Tollywood: సినీ ప్రేమికులకు శుభవార్త.. థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు ఉత్తర్వులు!

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Advertisement

సాంకేతికంగా కూడా అద్భుతమైన విజువల్స్, స్పష్టమైన వాయిస్ ఓవర్, చక్కని ఎడిటింగ్‌తో ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారు అరగంట పాటు ‘యూనిటీ’ డాక్యుమెంటరీని తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు జ్యూరీ ఛైర్మన్‌ అభినందనలు తెలిపారు. ఇప్పటికే ‘యూనిటీ’ డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకుని అవార్డులు అందుకుంది. ముంబయిలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో ‘యూనిటీ’ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్, ఐకానిక్ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును ‘యూనిటీ’ (UNITY) సొంతం చేసుకుంది. ఇలా.. ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దర్శకుడు విజయ్ కుమార్, నిర్మాత శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహోన్నత శిఖరం వంటి వ్యక్తి చరిత్రను గుర్తించి ప్రోత్సహించడంతో.. కొండా లక్ష్మణ్ బాపూజీ పట్ల ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చాటుకుందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల, జ్యూరీ సభ్యులకు దర్శకుడు విజయ్, నిర్మాత శ్రీకాంత్ తోపాటు అందులో నటించిన మైమ్ మధు, బాలనటుడు మాస్టర్ భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read- Gaddar Film Awards 2026: “గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025”.. తుది జాబితా ప్రకటించిన జ్యూరీ మెంబర్స్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×