Korean Heroine: ఇటీవల సినీ ఇండస్ట్రీలలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు ఏదో ఒక కారణాల చేత మరణిస్తున్నారు. కేవలం మన ఇండియా స్టార్స్ మాత్రమే కాదు అటు కొరియన్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మృతి చెందారు. మరో స్టార్ హీరోయిన్ కన్నుమూశారు. సౌత్ కొరియా స్టార్ నటి లీసియోయి మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె మేనేజరు ధృవీకరించారు.. ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఆయన వెల్లడించారు. ఆమె మృతికి గల కారణాలను వెల్లడించలేదు కానీ ఆమె చనిపోయిన విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టారు. ఇప్పటివరకు ఈమె చేసిన అన్ని వెబ్ సిరీస్ లు సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈమె నటించిన ది కిల్లింగ్ రొమాన్స్, ది కింగ్, వంటి పలు కొరియన్ వెబ్ సిరీస్ లలో నటించింది. ఈమె చివరిగా డివోర్స్ ఇన్సూరెన్స్ లో నటించారు.. ప్రస్తుతం ఈమె మరణ వార్త విన్న ఆమె అభిమానులు, కొరియన్ వెబ్ సిరీస్ లోనే చూస్తున్న తెలుగు సినీ అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు..
లీసియోయి మరణం తీరని లోటు..
సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోని అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అందుకే ఆ కొరియన్ వెబ్ సిరీస్ లో తెలుగులోకి డబ్ చేయబడి ఓటీటీలోకి తీసుకొని వస్తున్నారు. తెలుగు వాళ్లు వాటిని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొరియన్ వెబ్ సిరీస్ లలో నటించిన నటి లీసియోయి మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు.. SBS డ్రామా చియోంగ్‌డాంగ్-డాంగ్ స్కాండల్‌లో తన పాత్రకు బాగా పేరు పొందింది. ఆమె అకాల మరణ వార్త జూలై 1న ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మేనేజర్ వెల్లడించారు. సాంగ్ సూ-యియోన్‌గా జన్మించిన లీ సియో-యి జూన్ 20న కన్నుమూశారు. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం వెల్లడించలేదు. ఆమె మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు..
లీసియోయి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..
ఏప్రిల్ 18, 1982న జన్మించిన లీ సియోయి 2013లో MBC హిస్టారికల్ డ్రామా హర్ జున్, ది ఒరిజినల్ స్టోరీతో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ లుక్ లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత చియోంగ్‌డమ్-డాంగ్ స్కాండల్ లో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ది కింగ్ మరియు కిల్లింగ్ రొమాన్స్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించింది.. ఆమె నటనా ప్రతిభతో పాటు, లీ చదువులో కూడా చురుగ్గా ఉంటుంది. హంకుక్ యూనివర్శిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్‌లో చెక్ మరియు స్లోవాక్ అధ్యయనాలలో ప్రావీణ్యం సంపాదించింది..తరువాత పుసాన్ నేషనల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ స్టడీస్‌ను అభ్యసించింది. ఆ తర్వాత స్టడీస్ కి పుల్ స్టాప్ పెట్టి నటన వైపు అడుగులు వేసింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం లేదని తెలిసి ఆమె అభిమానులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు..