OTT Movie : రీసెంట్ గా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సరికొత్త స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తెలుగు సినిమా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీ చివరివరకూ సస్పెన్స్ తో కట్టి పడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ట్రైల్’ (The Trail). 2023లో వచ్చిన ఈ సినిమాకి రామ్ గన్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2023 నవంబర్ 24న విడుదలైంది. ఇందులో స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక మహిళా పోలీసు ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ సబ్-ఇన్‌స్పెక్టర్ రూపా అనే మహిళా పోలీసు ఆఫీసర్‌తో మొదలవుతుంది. ఆమె తన భర్త అజయ్ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. అజయ్ ఒక రోజు రాత్రి తమ ఇంటి టెర్రస్ నుండి పడి చనిపోతాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా, కేసును కూడా క్లోస్ చేస్తారు. అయితే అజయ్ స్నేహితులు, బంధువులు రూపాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెపై ఫిర్యాదు చేస్తారు. దీంతో కేసు మళ్ళీ రీ ఓపెన్ అవుతుంది. రూపా ఒక సమర్థవంతమైన పోలీసు ఆఫీసర్‌గా, తన భర్త మరణం వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే, తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొంటుంది.
కేసును దర్యాప్తు చేయడానికి సబ్-ఇన్‌స్పెక్టర్ రాజీవ్ ని అధికారులు నియమిస్తారు. మరో వైపు రూపా తన భర్త గురించి తెలియని కొన్ని రహస్యాలను కనిపెడుతుంది. ఇవి ఆమెను మానసికంగా కలవరపెడతాయి. ఈ క్రమంలో రూపా, రాజీవ్ మధ్య ఒక వృత్తిపరమైన గౌరవం ఏర్పడుతుంది. అయితే రాజీవ్ దర్యాప్తు రూపాపైకూడా అనుమానం వచ్చే విధంగా వెళ్తుంది. ఇక రూపా తన భర్త మరణంలో తన పాత్రపై వచ్చిన ఆరోపణలతో పోరాడుతూ, అదే సమయంలో అజయ్ గతాన్ని ఆరా తీస్తుంది. మరో వైపు రాజీవ్ దర్యాప్తులో కొన్ని ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ఆకట్టుకుంటుంది. ఇక్కడ అజయ్ మరణం వెనుక ఉన్న నిజం బయటపడుతుంది. చివరికి రూపా భర్త మరణానికి కారణం ఎవరు ? అది ప్రమాదమా లేక ఎవరైనా చంపారా ? ఇందులో రూపా పాత్ర ఏమైనా ఉందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : జూలైలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ మలయాళ సినిమాలు ఇవే… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?