Amarnath Yatra 2025: జమ్మూకాశ్మీర్‌లో పవిత్ర క్షేత్రమైన అమర్‌నాథ్ యాత్ర గురువారం నుంచి (జులై 3) ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం దాదాపు ఈసారి భక్తులు అమర్‌నాథ్ గుహలోని శివ లింగాన్ని దర్శించుకోనున్నారు. ఎప్పటిమాదిరిగా ఈసారి భక్తులు బ్యాచ్‌ల రూపంలో వెళ్తున్నారు. ఈ యాత్రను జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.
ఈ యాత్ర కోసం దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి విడతలో 5,880 మంది భక్తులు బయలుదేరారు. 38 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత క్రమంగా శివలింగం కరిగిపోతుంది. ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్ర దాడి జరిగినా భక్తుల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఈ యాత్ర ఆగస్టు 9తో ముగియనుంది. యాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి.
పహల్గామ్, బాల్తాల్ ఈ రెండు మార్గాల ద్వారా సాగనుంది. పహల్గామ్ వెంబడి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం ద్వారా అమర్‌నాథ్ గుహకు చేరుకోవడానికి దాదాపు 3 రోజులు పడుతుంది. ఈ మార్గం ద్వారా చాలా సులువు ఎక్కడ నిటారుగా మార్గం ఉండదు. దూరం ఎక్కువైనా భక్తులు ఈ మార్గం ద్వారానే ఎక్కువ మంది వెళ్తుంటారు. పహల్గామ్ తర్వాత మొదటి స్టాప్ చందన్వాడి.
ఇది బేస్ క్యాంప్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి కాలి నడక ప్రారంభమవుతుంది. మూడు కిలోమీటర్లు తర్వాత పిస్సు టాప్ చేరుతుంది. సాయంత్రం నాటికి శేషనాగ్ చేరుకుంటాము. దాదాపు 9 కిలోమీటర్లు ఉంది. మరుసటి రోజు శేషనాగ్ నుండి పంచతర్ణికి వెళ్తాము. అక్కడి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్ గృహ ఉంటుంది.
ALSO READ: వినాయ చవితి కరెక్ట్ తేదీ ఇదే, నిమజ్జనాలు అప్పుడే చేయాలి
రెండోది బాల్తాల్ మార్గం నుంచి కేవలం 14 కిలోమీటర్లు. కాకపోతే చాలా ఎక్కువ ఎత్తుతో ప్రయాణం చేయాల్సివుంటుంది. మార్గం చిన్నదే అయినా కష్టంగా ఉంటుంది. నిటారుగా ఎక్కాల్సి ఉంటుంది. వృద్ధులు ఈ మార్గంలో వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు. ఈ మార్గం ఇరుకుగా ఉంటుంది, ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఈ రెండు మార్గాల నుంచి వెళ్లే భక్తుల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి.
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. నిరంతరం యాత్రికుల్ని గమనిస్తూనే వారికి ఎలాంటి ఆపద రాకుండా ఉండేలా అధికారులు RFID ట్రాకింగ్, వైద్య సహాయం ఏర్పాటు చేశారు. ప్రయాణం సమయంలో మెడికల్ సర్టిఫికెట్, 4 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డ్, RFID కార్డ్, ప్రయాణ దరఖాస్తు ఫారమ్ కచ్చితంగా ఉండాలి.
ఇక్కడికి వెళ్లాలంటే ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు నడవడం సాధన చేయాలి. అలాగే ప్రాణాయామం, వ్యాయామం చేయాలి. ప్రయాణ సమయంలో ఉన్ని బట్టలు, రెయిన్ కోట్, ట్రెక్కింగ్ స్టిక్, వాటర్ బాటిల్, అవసరమైన మందుల ఉంచుకోవాలి.
Welcome To Shri Amarnath Yatra 2025 🙏🙏🙏🙏 #amarnath #amarnathyatra #bhole #bholenath #bholenath🙏 #mahadev #mahakal #shiv #shiva #instagood pic.twitter.com/V6YhLFXQJv
— The Tour My India Travels (@TheTourMyIndia) July 3, 2025