Kota – Brahmanandam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలలోనూ, హాస్య నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించారు నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao). ఈయన తెలుగు ఇండస్ట్రీలో సుమారు 750 కి పైగా సినిమాలలో నటించారు. ఒకానొక సమయంలో విలన్ పాత్ర అంటే అందరికీ టక్కున కోటా శ్రీనివాసరావు గుర్తుకొచ్చేవారు. అంత అద్భుతంగా ఈయన విలన్ పాత్రలలో జీవించేవారని చెప్పాలి. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్న కోట శ్రీనివాసరావు చివరి రోజులలో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
అనారోగ్యంతో తుది శ్వాస…
వయసు పై బడుతున్న నేపథ్యంలో ఈయనకు సినిమా అవకాశాలు లేకపోవడంతో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాస్ రావు నిన్న ఉదయం 4 గంటల సమయంలో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఈయన మరణ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. కోట శ్రీనివాసరావు మరణించడంతో ఆయన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన బ్రహ్మానందంతో (Brahmanandam)సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
హీరోల పక్కన బ్రహ్మానందం…
అప్పట్లో టాలీవుడ్ కమెడియన్స్ అంటేనే కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్(Babu Mohan), బ్రహ్మానందం వంటి వారు గుర్తుకు వచ్చారు. అయితే కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ బ్రహ్మానందంతో కలిసి ఈయన మాత్రం పెద్దగా సినిమాలను చేయలేకపోయారు. ఇలా బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావు కాంబినేషన్లో సినిమాలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కోటా శ్రీనివాసరావు సమాధానం చెబుతూ.. బ్రహ్మానందం ఎక్కువగా హీరోల పక్కన ఉండే పాత్రలలో నటించేవారు.
విలన్ పాత్రలలో కోటా…
ఇలా దాదాపు బ్రహ్మానందం చేసిన అన్ని సినిమాలు కూడా హీరో పక్కన పాత్రలలోనూ అలాగే పాజిటివ్ పాత్రలలో కనిపించేవారు. ఇక నా విషయానికొస్తే నాకంటూ ప్రత్యేకంగా ఒక విలన్ పాత్రని రాసేవారు. తద్వారా మా ఇద్దరి కాంబినేషన్లో పెద్దగా సినిమాలు రాలేకపోయాయని, అలా వచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో మేమిద్దరం కలిసి సినిమాలు చాలా తక్కువగా చేశాము అంటూ కోట శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక కోట గారి మరణం వార్త తెలుసుకున్న బ్రహ్మానందం కోటా చివరి చూపుల సమయంలో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.
Also Read: KingDom : అడ్డంకులు అన్నీ తొలగి ఫైనల్‌గా విడుదల అవుతుంది… కొత్త టైటిల్ ఇదే