BigTV English

KingDom : అడ్డంకులు అన్నీ తొలగి ఫైనల్‌గా విడుదల అవుతుంది… కొత్త టైటిల్ ఇదే

KingDom : అడ్డంకులు అన్నీ తొలగి ఫైనల్‌గా విడుదల అవుతుంది… కొత్త టైటిల్ ఇదే

Kingdom: డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్ డం(King Dom). సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తిరకెక్కిన ఈ సినిమా జూలై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుసగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఒక ప్రోమో వీడియో భారీ స్థాయిలో సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. అదేవిధంగా తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి తదుపరి పాట “అన్నా అంటేనే” గురించి ఒక అప్‌డేట్‌ను తెలియజేశారు.


సామ్రాజ్యం పేరుతో విడుదల..

ఇకపోతే ఈ సినిమా హిందీ విడుదల(Hindi Release) గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. గతంలో ఈ సినిమా హిందీలో విడుదల కాలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా హిందీలో కూడా విడుదల కాబోతుందని తెలుస్తుంది అయితే హిందీలో “కింగ్ డం” అనే పేరు కాకుండా “సామ్రాజ్యం”(Samrajyam) అనే పేరుతో విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక హిందీలో కూడా జూలై 31వ తేదీనే ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్(Netflix) కైవసం చేసుకున్న నేపథ్యంలో హిందీ విడుదల విషయంలో కొన్ని షరతులను కూడా విధించినట్టు తెలుస్తోంది.


సింగిల్ స్క్రీన్ లకే పరిమితం..

నెట్ ఫ్లిక్స్ నిబంధనల ప్రకారం…హిందీ వెర్షన్ పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రదర్శించబడదు. ఇది సింగిల్ స్క్రీన్‌లలో మాత్రమే ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్ గా నటించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా స్పై యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

కింగ్ డం పైనే ఆశలు..

ఇక ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ సినిమాలను అందుకోలేకపోతున్నారు. ఈయన గీతగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత ఈ స్థాయిలో మరో సక్సెస్ అందుకోలేదు. విజయ్ దేవరకొండ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేక్షకులను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇక ఈయన చివరిగా ‘ఫ్యామిలీ స్టార్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో విజయ్ అభిమానుల ఆశలన్నీ కూడా కింగ్ డం సినిమా పైనే ఉన్నాయి. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం ప్రారంభించబోతున్నారు.

Also Read: Actress Death: ఇండస్ట్రీలో విషాదం… క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి?

Related News

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Big Stories

×