Case On PA Ranjith : తమిళ దర్శకుడు పా రంజిత్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రంజిత్ చేసిన కాలా,కబాలి సినిమాలు అతనికి మంచి గుర్తింపుని తీసుకొని వచ్చాయి. తను తీసిన సినిమాలు కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా డబ్ కావటం వలన చాలామంది ప్రేక్షకులు చూసే ఉంటారు.
పా రంజిత్ కు సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అతను చేసిన కొన్ని సినిమాలను సోషల్ మీడియా వేదికగా ఎక్స్ప్లైన్ చేస్తూ పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా అనగారిన వర్గాల గురించి ఆయన సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయన వర్క్ కూడా కొంతమంది ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అతని సినిమాలు ఎప్పుడూ కూడా ఎంటర్టైన్మెంట్ కాకుండా, ఒక సామాజిక స్పృహని తెలియజేసేలా ఉంటాయి.
పా రంజిత్ పై కేసు నమోదు
ఆర్య హీరోగా పా రంజిత్ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి వెట్టువం టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో సార్పట్టా పరంపర అనే సినిమా కూడా వచ్చింది. డైరెక్ట్ ఓటిటిలో విడుదలైన సినిమా మంచి రెస్పాన్స్ సాధించింది. అయితే వీరిద్దరి దర్శకత్వంలో ప్రస్తుతం వస్తున్న సినిమా షూటింగ్లో ఒక అనుకొని సంఘటన జరిగింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న తరుణంలో స్టంట్ మాస్టర్ రాజు కారు పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్ మాస్టర్ రాజు చనిపోవడంతో దర్శకుడు రంజిత్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో రంజిత్ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది అనేది కొంతమంది అభిప్రాయం.
గతంలో ఎన్నోసార్లు
ఇక స్టంట్ మాస్టర్ రాజు విషయానికి వస్తే గతంలో ఎన్నోసార్లు స్టంట్ చేశారు. చాలాసార్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ సినిమా షూటింగ్లో మాత్రం అలా జరగటం అనేది ఎవరు ఊహించలేనిది. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా కూడా నా కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఇక రంజిత్ ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: Sreeleela : జాతరలో చిందులు వేయడమే కాకుండా, జానీ మాస్టర్ కి గిఫ్ట్