E-Paper
Advertisement

Krishna Chaitanya: అందరు హీరోలను పక్కనపెట్టి సందీప్ కిషన్ తో ముందుకు వెళ్తున్న కృష్ణ చైతన్య

Krishna Chaitanya: అందరు హీరోలను పక్కనపెట్టి సందీప్ కిషన్ తో ముందుకు వెళ్తున్న కృష్ణ చైతన్య
Advertisement

Krishna Chaitanya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ చైతన్య. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు మంచి పాటలను రాశాడు ఆ పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే నారా రోహిత్ హీరోగా చేసిన రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

రౌడీ ఫెలో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి కృష్ణ చైతన్య అందించిన డైలాగ్స్. ఆ సినిమాను తీసిన విధానం. ఆ సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్జేషన్ డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా ప్రేక్షకులకి ఆసక్తికరంగా అనిపించాయి. రౌడీ ఫెలో సినిమా తర్వాత ఛల్ మోహన్ రంగా అనే సినిమాతో మరోసారి దర్శకుడిగా మారాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

Advertisement

సందీప్ కిషన్ హీరోగా 

కృష్ణ చైతన్య దగ్గర పవర్ పేట అనే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ఉంది. ఈ సినిమాను విశ్వక్సేన్ హీరోగా చేస్తాడు అని ఒక తరుణంలో న్యూస్ కూడా వచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సక్సెస్ సాధించలేదు. ఈ పవర్ పేట సినిమా నితిన్ హీరోగా చేస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సందీప్ కిషన్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సందీప్ కిషన్ ప్రస్తుతం విజయ్ తనయుడు జాసన్ విజయ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఒకవైపు తమిళ్లోను మరోవైపు తెలుగులోను సందీప్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Advertisement

కం బ్యాక్ ఇవ్వాలి 

రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి దర్సకుడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కృష్ణ చైతన్య. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడకపోయినా కూడా కొంతమందికి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. సినిమాలో విశ్వక్సేన్ నటించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది ఇంతకుముందు ఎప్పుడు కెరియర్ లో నటించని విధంగా ఈ సినిమాలో నటించాడు విశ్వక్. అయితే రౌడీ ఫెలో సినిమాను మించి ఇప్పటివరకు కృష్ణ చైతన్య గొప్ప సినిమా తీయలేదు అనేది వాస్తవం. ఒకవేళ సందీప్ కిషన్ తో చేయబోయే పవర్ పేట ఆ రేంజ్ లో ఉంటే, దర్శకుడుగా కృష్ణ చైతన్య కూడా ఒక కం బ్యాక్ ఇచ్చినట్లే.

Also Read: Hari Hara Veeramallu: ఆ పొలిటిషన్ కి అదిరిపోయే సమాధానం ఇచ్చిన నిర్మాత ఏం రత్నం

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×