Ind Vs Eng 4th Test : ప్రస్తుతం భారత్ (India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరుగుతోంది. ఇవాల మ్యాచ్ చివరి రోజు. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. గిల్ ఈ సిరీస్ లో తన నాలుగో టెస్ట్ సెంచరీని 228 బంతుల్లో పూర్తి చేశాడు. తన టెస్ట్ కెరీర్ లో ఆరో సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్ లో గిల్ 700 కంటే ఎక్కువ పరుగులు చేశఆాడు. 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేసాడు. ఈ మ్యాచ్ లోో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతిథ్య ఇంగ్లాండ్ భారత్ పై 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. అంతకు ముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు మాత్రమే చేసింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు 1-2 తో వెనుకబడి ఉంది.
Also Read : Ex Pak Player on India : ఆసియా కప్ పై పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.. బాయ్ కాట్ అంటున్న అభిమానులు
గిల్ చారిత్రాత్మక ఘనత
ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత జట్టు 1-2 తేడాతో వెనుకబడి ఉంది. సిరీస్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత కెప్టెన్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) ఆదివారం చారిత్రాత్మక ఘనత సాధించాడు. విదేశీ టెస్ట్ సిరీస్ లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు. 2025లో ఇంగ్లాండ్ తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు గిల్. 25 ఏళ్ల గిల్ ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన లెజెండరీ కెప్టెన్ల జాబితాలో చేరాడు. ఇక ఈ జాబితాలో సర్ డాన్ బ్రాడ్ మాన్, సర్ గ్యారీ సోబర్స్, గ్రెగ్ చాపెల్, సునీల్ గవాస్కర్, డేవిడ్ గోవర్, గ్రాహం గూచ్, గ్రేమ్ స్మిత్ వంటి పేర్లు ఉన్నాయి. ఇక సునీల్ గవాస్కర్, యశస్వి జైస్వాల్ తరువాత టెస్ట్ సిరీస్ లో 700 పరుగులు దాటిగా మూడో భారత బ్యాట్స్ మెన్ గా నిలిచాడు గిల్.
తొలి భారతీయ కెప్టెన్ గా రికార్డు
ఎడ్జ్ బాస్టన్ లో 269 పరుగుల కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ తో సహా గిల్ ఇప్పటికే సిరీస్ లోని మొదటి ఏడు ఇన్నింగ్స్ లో 619 పరుగులు చేశాడు. గిల్, కేఎల్ రాహుల్ తో కలిసి రెండు సెషన్ల పాటు పోరులో నిలిచి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి కఠినమైన బౌలింగ్ ను ఎదుర్కొని.. స్పిన్ కి వ్యతిరేకంగా అద్భుతమైన పోరాటం చేశారు గిల్, రాహుల్. లియామ్ డాసన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టడం ద్వారా 700 పరుగుల పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ దాదాపు 17 గంటల పాటు కొనసాగింది. ఇది అతని సహనం, అంకిత భావానికి ఉదాహరణ అని చెప్పవచ్చు. అతను 147, 161, 269 పరుగులు చేశాడు. సునీల్ గవాస్కర్ 774, 732, జైస్వాల్ 712, విరాట్ కోహ్లీ 692 నాలుగో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ గా గిల్ విదేశాల్లో టెస్ట్ సిరీస్ లో 700 కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయుడు కావడం విశేషం.